యూకేలో విషాదం : నదిలో మునిగి భారత సంతతి బాలుడు మృతి, ‘లిటిల్ ప్రొఫెసర్’ అంటూ నివాళి

ఇంగ్లాండ్‌లోని వేల్స్‌లో విషాదం చోటు చేసుకుంది.ఓ 13 ఏళ్ల భారత సంతతి బాలుడు ప్రమాదవశాత్తూ నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.

 Indian-origin Family Pays Tribute To Its 'little Professor' Drowned In River In-TeluguStop.com

మంగళవారం కార్డిఫ్‌లోని టాఫ్ నదిలో ఆర్మన్ ఘోనియా అనే బాలుడు గల్లంతయ్యాడు.దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్, కోస్ట్‌గార్డ్, పోలీస్ హెలికాఫ్టర్ల సాయంతో అతని కోసం తీవ్రంగా గాలించారు.

సౌత్ వేల్స్ పోలీసులు అతనిని గుర్తించినప్పటికీ.ఆర్యన్ ప్రాణాలు కాపాడలేకపోయారు.

అతని ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

జితేంద్ర, హీనా ఘోనియా దంపతులకు ఆర్యన్, నవ్య ఘోనియా సంతానం.

డాన్స్‌కోర్ట్ ప్రైమరీ స్కూల్, రాడిర్ కాంప్రహెన్సివ్ స్కూల్‌లో మృతుడు చదువుకున్నాడు.ఆర్యన్ గణితంలో చాలా చురుగ్గా వుండేవాడని.

అందుకే అతనిని లిటిల్ ప్రొఫెసర్‌ అంటూ పిలిచేవాళ్లమని కుటుంబ సభ్యులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.అతను తమ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడని.

ఈ విపత్కర సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన పోలీసులు, స్థానిక అధికారులు, కమ్యూనిటీకి వారు కృతజ్ఞతలు తెలిపారు.మరోవైపు ఆర్యన్ స్నేహితులు.

అతను ప్రాణాలు కోల్పోయిన టాఫ్ నది ఒడ్డున పవ్వులు, బెలూన్లు, సంతాప సందేశాలను వుంచి నివాళులర్పించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Telugu Armonghonia, Brampton, Canada, Heena Ghonia, Indianorigin, Jitendra, Nava

ఇకపోతే.గత నెలలో కెనడాలో ప్రమాదవశాత్తూ నీటమునిగి పంజాబ్‌కు చెందిన భారతీయ విద్యార్ధి మృతి చెందిన సంగతి తెలిసిందే.యువకుడిని పంజాబ్‌ రాష్ట్రం మోగా జిల్లాలోని నిహల్‌సింగ్ వాలా సబ్ డివిజన్‌లోని బధ్నీ కలాన్ గ్రామానికి చెందిన నవకిరణ్ సింగ్‌గా గుర్తించారు.ఇతను ఉన్నత విద్య కోసం గతేడాది కెనడాకు వెళ్లాడు.

ఈ క్రమంలో అంటారియో ప్రావిన్స్‌లోని బ్రాంప్టన్‌లో వున్న ఎల్డోరాడో పార్క్‌కు స్నేహితులతో కలిసి వెళ్లాడు కిరణ్.అయితే అక్కడ ప్రమాదవశాత్తూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు.

అతని మరణవార్తను స్నేహితులు భారత్‌లోని తల్లిదండ్రులకు తెలియజేశారు.ఉన్నత చదువులు చదివి జీవితంలో గొప్పస్థాయికి చేరుకుంటాడనుకున్న కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా కిరణ్ మృతదేహాన్ని భారతదేశానికి రప్పించేందుకు సాయం చేయాల్సిందిగా వారు పంజాబ్, భారత ప్రభుత్వాలను కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube