భారత సంతతి కుటుంబం దారుణ హత్య... నిందితుడిలో కనిపించని పశ్చాత్తాపం, నిర్దోషినంటూ వాదన

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కిడ్నాప్‌కు గురైన భారతీయ కుటుంబం కథ విషాదాంతమైన సంగతి తెలిసిందే.దుండగుల చేతిలో అపహరణకు గురైన ఎనిమిది నెలల చిన్నారి సహా ఆమె తల్లిదండ్రులు, వారి సమీప బంధువు ఓ తోటలో శవాలై తేలారు.

 Indian-origin Family Killed In California : Suspect Pleads Not Guilty, Indian-or-TeluguStop.com

ఈ విషయాన్ని కాలిఫోర్నియాలోని మెర్సెడ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ధ్రువీకరించింది.వీరంతా పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌ జిల్లా హర్సీ పిండ్‌కు చెందినవారు.

మృతులు జస్‌దీప్ సింగ్, జస్లీన్ కౌర్, వారి ఎనిమిది నెలల చిన్నారి అరూహి ధేరి , వీరి సమీప బంధువు అమన్‌దీప్ సింగ్‌.

భారత్- అమెరికాలలో సంచలనం సృష్టించిన ఈ కేసును కాలిఫోర్నియా పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

ఇప్పటికే జీసస్ సల్గాడోను అరెస్ట్ చేశారు.ఈ కేసుకు సంబంధించి గురువారం కోర్టులో విచారణ జరిగింది.

అయితే తాను ఏ నేరం చేయలేదని.తాను నిర్దోషినని న్యాయమూర్తి ముందు వాదించాడు.

అంతేకాదు ఇంతటి విషాదానికి కారణమై కూడా అతనిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించకపోవడం గమనార్హం.పోలీసులు చెబుతున్న దానిని బట్టి… జస్‌దీప్‌తో వివాదం కారణంగానే సల్గాడో వారిని కిడ్నాప్ చేసి, గంటలోనే వారిని హతమార్చినట్లుగా తెలుస్తోంది.

Telugu Aruhi Dheri, Calinia, Hoshiarpur, Indian Origin, Jasdeep Singh, Jasleen K

సల్గాడోను వచ్చే నెలలో మరోసారి కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు.అలాగే కేసు విచారణ పూర్తయ్యే వరకు అతను బెయిల్ లేకుండా జైలులోనే వుంటాడని పోలీసులు తెలిపారు.ఒకవేళ సల్గాడో నేరం రుజువైన పక్షంలో అతను పెరోల్ లేకుండా జీవితాంతం జైలులోనే గడపాల్సి వుంటుంది.అయితే మెర్సెడ్ కౌంటీ షెరీఫ్ వెర్న్ వార్న్‌కే సల్గాడోకి మరణశిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరుతున్నారు.

మరోవైపు.సల్గాడో సోదరుడు అల్బెర్టో సల్గాడో (41)ను నేరపూరిత కుట్ర, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి అభియోగాలపై అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు తరలించారు.

కాగా.శనివారం టర్లాక్‌లో జస్‌దీప్ సింగ్, జస్లీన్ కౌర్, చిన్నారి అరూహి ధేరి , అమన్‌దీప్ సింగ్‌‌ల అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ అంత్యక్రియలకు బయటి వ్యక్తులను అనుమతించరు.అయితే వీరికి మద్ధతుగా బయట వుండొచ్చని పోలీసులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube