స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో( Glasgow, Scotland ) జన్మించిన భారత సంతతికి చెందిన కళాకారిణి జస్లీన్ కౌర్ ( Jasleen Kaur )బ్రిటన్ ప్రతిష్టాత్మక పురస్కారం టర్నర్ ప్రైజ్ 2024ని గెలుచుకున్నారు.మంగళవారం రాత్రి లండన్‌లోని టేట్ బ్రిటన్‌లో( Tate Britain in London ) జరిగిన తన సోలో ఎగ్జిబిషన్ ‘ఆల్టర్ ఆల్టర్’కు సంబంధించి 25 వేల పౌండ్లు ( భారత కరెన్సీలో రూ.26.84 లక్షలు ) బహుమతిని ఆమె గెలుచుకున్నారు.
30 ఏళ్ల వయసులో ఆభరణాల తయారీని అభ్యసించి ఆపై కళాకారిణిగా మారారు కౌర్.ఈమెతో పాటు 10 వేల పౌండ్ల అవార్డ్ గెలుచుకుని షార్ట్ లిస్ట్‌లో ( short list )స్థానం సంపాదించిన ముగ్గురు ఇతర కళాకారుల ప్రదర్శన లండన్‌లోని థేమ్స్ నది ఒడ్డున ఉన్న టేట్ బ్రిటన్ మ్యూజియంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు.
ఇకపోతే ప్రపంచంలోని దృశ్య కళలకు సంబంధించి అత్యంత ప్రసిద్ధ బహుమతులలో టర్నర్ ప్రైజ్ కూడా ఒకటి.సమకాలీన బ్రిటీష్ కళలో కొత్త పరిణామాల గురించి బహిరంగ చర్చను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ అవార్డ్‌ను ఏర్పాటు చేశారు.1984లో స్థాపించబడిన ఈ బహుమతికి రాడికల్ పెయింటర్ జేఎండబ్ల్యూ టర్నర్ ( Painter JMW Turner )పేరు పెట్టారు.ప్రతి ఏడాది ఓ బ్రిటీష్ కళాకారుడికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు.
గతంలో భారత సంతతికి చెందిన బ్రిటీష్ ఇండియన్ శిల్ప కళాకారుడు అనీష్ కపూర్ ( Anish Kapoor )కూడా ఈ అవార్డ్ అందుకున్న వారిలో ఉన్నారు.
ఈ అవార్డ్ ఏర్పాటు చేసి 2024 నాటికి 40 ఏళ్లు పూర్తి చేసుకుంది.గడిచిన ఆరేళ్లలో తొలిసారిగా టేట్ బ్రిటన్‌కు ఈ పురస్కారం దక్కింది.ఈ ఏడాది షార్ట్ లిస్ట్ చేయబడిన ఇతర కళాకారులలో ఫిలిపినో హెరిటేజ్‌కి చెందిన పియో అబాద్, బ్లాక్ బ్రిటీష్ ఆర్ట్స్ మూవ్‌మెంట్ వ్యవస్థాపక సభ్యురాలు క్లాడెట్ జాన్సన్ , రోమానీ హెరిటేజ్‌కు చెందిన డెలైన్ లే బాస్ ఉన్నారు.