కెనడాలో విషాదం చోటు చేసుకుంది.రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగడంతో భారతీయుడు సజీవ దహనమయ్యాడు.
అల్బెర్టా ప్రావిన్స్‌లోని ఎడ్మంటన్ నగరంలో సోమవారం ఈ ఘటన జరిగింది.మృతుడిని పంజాబ్ రాష్ట్రం ఫరీద్‌కోట్‌లోని గజ్జన్ సింగ్ వాలా గ్రామానికి చెందిన గుర్కీరత్ సింగ్ (42)గా గుర్తించారు.
ఇతను భారత్ నుంచి వచ్చి కెనడాలో ఓ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.ఫోర్ట్ మెక్‌ముర్రే నుంచి ఎడ్మంటన్‌కు వ్యాన్‌లో వస్తుండగా ఇతని వాహనాన్ని మరో వ్యాన్ ఢీకొట్టింది.
దీంతో రెండు వాహనాల్లో మంటలు చెలరేగడంతో గుర్కీరత్ సింగ్ సజీవదహనమయ్యాడు.ఇదే ఘటనలో మరో వ్యక్తి కూడా అగ్నికి ఆహుతైనట్లు పోలీసులు చెబుతున్నారు.
గుర్కీరత్ మరణవార్తను తెలుసుకున్న అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇకపోతే.
గత నెలలో కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన ట్రక్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు.మృతుడిని జగ్‌సిర్ సింగ్ గిల్ (28)గా గుర్తించారు.
ఇతను ఓ ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.మృతుడు భార్య, తన ఇద్దరు పిల్లలతో కలిసి కలగరీలో నివసిస్తున్నాడు.
బ్రిటీష్ కొలంబియాలోని గోల్డెన్ ఏరియాలో నేషనల్ హైవే 1పై జంతువులను తీసుకెళ్తున్న ట్రక్ ఓవర్‌టేక్ చేస్తూ అతని ట్రక్‌ని ఢీకొట్టింది.దీంతో జగ్‌సిర్ ట్రక్కు బోల్తా పడటమే కాకుండా రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి.
ఈ ప్రమాదంలో అతని శరీరం పాక్షికంగా కాలిపోయిందని… ఈ గాయాలతోనే జగ్‌సిర్ ప్రాణాలు కోల్పోయినట్లు అతని తండ్రి కుల్వంత్ సింగ్ పేర్కొన్నారు.

మరోవైపు.జూలైలో టొరంటోలోని నైట్ క్లబ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో భారత సంతతికి చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.మృతుడిని 26 ఏళ్ల పర్దీప్ బ్రార్‌గా గుర్తించారు.
ఇతను బ్రాంప్టన్‌లో నివసిస్తున్నాడు.ఈ ఘటనలో 24 ఏళ్ల యువతి కూడా గాయపడిందని.
ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.బాథర్ట్స్ స్ట్రీట్ సమీపంలోని 647 కింగ్ సెయింట్ డబ్ల్యూ వద్ద ఈ ఘటన జరిగినట్లు టొరంటో పోలీసులు తెలిపారు.