ఇందిర హత్యను ప్రస్తావిస్తూ కెనడాలో ఖలిస్తాన్ మద్ధతుదారుల నిరసన .. భారత్ ఆగ్రహం

భారత ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా .కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాదం, ఖలిస్తాన్ అనుకూల చర్యలకు అడ్డుకట్ట పడటం లేదు.

తాజాగా జూన్ 6వ తేదీన ఆపరేషన్ బ్లూ స్టార్ ( Operation Blue Star ) వార్షికోత్సవం సందర్భంగా వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయం ముందు ఖలిస్తానీ వేర్పాటువాదులు మాజీ ప్రధాని ఇందిరా గాంధీని( Indira Gandhi ) హత్య చేసిన విధానాన్ని తెలుపుతూ నిరసన చేపట్టడంపై ఒట్టావాలోని( Ottawa ) భారత హైకమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఇందిరా గాంధీ హత్యను ప్రస్తావిస్తూ నిరసన తెలపడం ఇదే తొలిసారి కాదు.

గతేడాది జూన్‌లోనూ ఇదే రకమైన కార్యక్రమాన్ని నిర్వహించారు.బ్రాంప్టన్ నగరంలో దాదాపు 5 కిలోమీటర్ల మేర నిర్వహించిన ప్రదర్శనలో ఇందిర హత్యోదంతాన్ని తెలుపుతూ శకటాన్ని ప్రదర్శించారు.

తలపాగాలు ధరించిన ఇద్దరు గన్‌మెన్‌లు ఇందిరపై కాల్పులు జరుపుతుండగా.రక్తపు మరకలు, బుల్లెట్ గాయాలతో ఇందిర కుప్పకూలుతున్నట్లుగా దీనిని ప్రదర్శించారు.

Advertisement

ఈ ఘటనపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ( S Jaishankar ) ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే కెనడా ( Canada ) ఇలా చేస్తోందన్నారు.

వేర్పాటువాదులు, తీవ్రవాదులకు అక్కడ అవకాశాలు లభిస్తున్నాయని.ఇది ఇరుదేశాల మధ్య సంబంధాలకు , ప్రత్యేకించి కెనడాకు మంచిది కాదని జైశంకర్ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా సైతం ఈ చర్యను ఖండించారు.

కాగా.1980వ దశకంలో సిక్కు వేర్పాటు వాదం మనదేశంలో రక్తపుటేరులు పారించిన సంగతి తెలిసిందే.పాకిస్తాన్ మద్ధతుతో పంజాబ్‌కు చెందిన కొందరు సిక్కులు ప్రత్యేక ఖలిస్తాన్ దేశాన్ని( Khalistan ) కోరుతూ మారణహోమం సృష్టించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 29, శనివారం 2024
నయనతారతో ఆ సినిమా చేసి తప్పు చేశా.. ప్రముఖ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో నక్కిన ఖలిస్తాన్ ఉగ్రవాదులను ఏరివేయాల్సిందిగా నాటి ప్రధాని ఇందిరా గాంధీ సైన్యాన్ని ఆదేశించారు.ప్రధాని ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన భారత సైన్యం దీనికి ‘ఆపరేషన్ బ్లూస్టార్’ అనే పేరు పెట్టి 1984 జూన్ 6న స్వర్ణ దేవాలయంలోకి అడుగుపెట్టి ఉగ్రవాదులను కాల్చి చంపింది.

Advertisement

అయితే ఈ ఘటనతో సిక్కులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే 1984 అక్టోబర్ 31న ప్రధాని అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్‌‌లు ఇందిరా గాంధీపై కాల్పులు జరిపి దారుణంగా హత్యచేశారు.

ఇందిర హత్యతో దేశం ఉడికిపోయింది.ఈ హత్యకు ప్రతీకారంగా పలు చోట్ల సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగాయి.దేశ రాజధాని ఢిల్లీతో పాటూ దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సిక్కులను ఊచకోత కోశారు.

ఆస్తుల ధ్వంసం, మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దోపిడిలతో అల్లరి మూకలు బీభత్సం సృష్టించాయి.ఈ అల్లర్లలో దాదాపు 2800 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారిక లెక్కలు చెబుతున్నా.

ఈ సంఖ్య భారీగానే వుంటుందని అంచనా.

తాజా వార్తలు