అమ్మే అతడి సైన్యం.. కొడుకు కోసం తల్లి ఆరాటం

మీరు న్యూస్ ఫాలో అవుతుంటే ప్రజ్ఞానంద( Praggnanandhaa ) ఈ పేరు మీరు వినే ఉంటారు.ప్రజ్ఞానంద చిన్న వయసులోనే చరిత్ర సృష్టించాడు.

 Indian Chess Prodigy R Praggnanandhaa Mother Nagalakshmi Details,praggnanandhaa,-TeluguStop.com

ఇతనో చెస్ ప్లేయర్.అయితే ఇతను చిన్న వయసులోనే ప్రతిష్ఠాత్మక ఫిడే చెస్ ప్రపంచ కప్ పోటీల్లో రన్నరప్ గా నిలిచాడు.

ప్రజ్ఞానంద ఫైనల్స్ లో ఓడినా అతను అందరి మనసులను గెలుచుకున్నాడు.ప్రజ్ఞానంద విజయంలో తల్లి నాగలక్ష్మి పాత్ర కీలకం.

కొడుకును ముందుండి నడిపిస్తుంది.


Telugu Praggnanandhaa-Latest News - Telugu

రమేష్ బాబు, నాగలక్ష్మిల కొడుకు ప్రజ్ఞానంద.ఇతని చిన్న వయస్సులోనే తల్లి చదరంగా అట్ట ముక్క అతని చేతిలో పెట్టింది.ఎప్పుడు టీవీల ముందు ఉండే బదులు ఇది నేర్చుకో అని చెప్పింది.

అంతే ఆ తరువాత ప్రజ్ఞానంద తల్లి చెప్పిన మాటని విన్నాడు.అక్కడి నుంచి ప్రజ్ఞానంద విజయం మొదలైంది.

ఆ తరువాత ప్రజ్ఞానంద ప్రపంచానికి 18 ఏళ్ల అంతర్జాతీయ చదరంగం గ్రాండ్ మాస్టర్ పరిచయమయ్యాడు.ఆరేళ్ల వయసు నుండి ఇప్పటిదాకా ప్రజ్ఞానంద జాతీయ, అంతర్జాతీయ చదరంగం( Chess Game )లో లెక్కలేనన్ని విజయాలను ఖాతాలో వేసుకున్నాడు.


Telugu Praggnanandhaa-Latest News - Telugu

అయితే మీరు ప్రజ్ఞానంద ఫైనల్స్ ఆడే ముందు చూసే ఉంటారు.ప్రజ్ఞానంద ఎక్కడ ఉన్న తల్లి నాగలక్ష్మి( Praggnanandhaa Nagalakshmi ) కొడుకుకి దగ్గరగా ఉండేది.దూరం నుంచి చూస్తూనే కొడుకుని ముందుండి నడిపించింది.తల్లికి చదరంగం తెలియకపోయినా కోచింగ్ లో చేర్పించడమే కాకుండా కొడుకుకి తోడుగా వెళ్ళేది.ప్రజ్ఞానంద చదరంగం ఆడుతుంటే తల్లి ఒక మూలన కూర్చొని దేవుడిని ప్రార్థిస్తూ ఉండేది.తల్లి దీవెనెలు ప్రజ్ఞానందకి ఎప్పుడు ఉండేవి.

ప్రజ్ఞానంద ఎంత దూరం వెళ్లిన తల్లి కూడా వెళ్ళేది.అంతేకాదు కొడుకు కోసం ఒక స్టౌ, వంటకు తగిన బియ్యం, మసాల పొడులు సంచిలో వేసుకుని వెంట వెళ్లి వంట చేసి పెట్టేది.

కొడుకు కోసం నాగలక్ష్మి ఏమైనా చేసేది.తల్లి కష్టపడి ప్రజ్ఞానందని చదరంగంలో రాజుని చేసింది.

అంతేకాదు భవిష్యత్తులో ప్రజ్ఞానంద చదరంగంలో కొత్త రికార్డులు సృష్టిస్తాడు.అమ్మ ఆశీర్వాదం ఉంటె కొడుకు ఏదైనా సాధిస్తాడు అని ప్రజ్ఞానంద నిరూపించాడు.

ఇప్పుడు అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నాడు.కొడుకును సపోర్ట్ చేస్తున్న ప్రజ్ఞానంద తల్లికి అందరు శభాష్ అంటున్నారు.

ఇప్పటికే రికార్డులు సృష్టించిన ప్రజ్ఞానంద భవిష్యత్తులో ఏ రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube