భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు.మరే ఇతర దేశంలో లేని విధంగా నాలుగు నెలల క్రితం ప్రతి రోజూ మూడున్నర లక్షలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు, 3 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.
కేసుల పెరుగుదలతో దేశంలోని ఆసుప్రత్రులపై ఒత్తిడి పెరిగిపోయింది.ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంంతో ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీశారు.
దీంతో బెడ్లు, ఆక్సిజన్ సదుపాయలకు తీవ్ర కొరత ఎదురైంది.బెడ్లు దొరుకుతున్నా సకాలంలో ఆక్సిజన్ లభించక వేలాది మంది కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు.
ఆ సమయంలో ఎక్కడ చూసినా కార్లలో, ఆటోల్లో, రోడ్ల మీద ఆక్సిజన్ సిలిండర్‌తో కనిపించిన దృశ్యాలు, శ్మశాన వాటికల్లో భారీగా ఖననాలను చూసి యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.ఈ విపత్కర పరిస్ధితి నుంచి బయట పడేందుకు భారత్ అందుబాటులో వున్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయత్నించింది.
అటు ఇండియాను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం సైతం ముందుకొచ్చింది.ఇక కరోనా సెకండ్ వేవ్ సమయంలో ప్రవాస భారతీయులు చేసిన సేవలు ఎవరూ మరిచిపోలేరు.వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు పీపీఈ కిట్లు, మందులు, రక్షణ పరికరాలు, టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు తదితర వస్తువులను భారతదేశానికి పంపారు.అయితే పెద్దలే కాదు.
మేం కూడా తక్కువ తినలేదంటూ చిన్నారులు కూడా ఇండియా కోసం సాయం చేస్తున్నారు.
ఈ క్రమంలో భారతదేశ వైద్య ఆరోగ్య వైద్య వ్యవస్థను నిలబెట్టడానికి యూనిసెఫ్ సహా ఇతర అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయి.
ఇప్పటికీ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, టెస్టింగ్ పరికరాలతో పీపీఈ కిట్ల వంటివి అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ క్రమంలో యూనిసెఫ్‌కు సహాయం చేసేందుకు 11 ఏళ్ల భారత సంతతి చిన్నారి హాసిని సూర్యదేవర కూడా చేయి కలిపింది.
అమెరికాతో పాటు ఇతర దేశాల నుంచి నిధులు సేకరించేందుకు కార్యక్రమం చేపట్టింది.
అమెరికాలోని నెవడా రాష్ట్రం, రెనో ప్రాంతంలో నివసిస్తున్న హాసిని సూర్యదేవర, ఆమె సోదరుడు రిషాన్‌తో కలిసి ‘‘ గో ఫండ్ మీ ’’ వేదిక ద్వారా నిధుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా హాసిని మాట్లాడుతూ.భారత్‌లో తమ కుటుంబీకులతో పాటు స్నేహితులు ఎంతోమంది వున్నారు.
కోవిడ్ మహమ్మారి విజృంభణ వేళ వీరంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని.అందుకే ఇలాంటి వారికి సాయం చేయాలని భావిస్తున్నట్లు చెప్పింది.
కాగా, కొద్దినెలల క్రితం కోవిడ్ వల్ల భారత్ పడుతున్న ఇబ్బందులు.ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు పోతున్న సంఘటనల్ని టీవీలో చూసిన ముగ్గురు ఎన్ఆర్ఐ బాలురు తమ వయసును సైతం పక్కనబెట్టి ఇండియాకు ఏమైనా చేయాలనుకున్నారు.దీనిలో భాగంగా ఫైండ్ రైజింగ్ ద్వారా దాదాపు రూ.2 కోట్లు సేకరించారు.వారే గియా గుప్తా, కరీనా గుప్తా, అర్మాన్ గుప్తాలు.వీరి అందరి వయసు (15) సంవత్సరాలే కావడం గమనార్హం.అప్పట్లో ఈ చిన్నారులు చేసిన పని వైరల్ అయ్యింది.