షార్జాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం, మృతుల్లో భారతీయుడు

షార్జాలో( Sharjah ) పికప్‌ వ్యాన్‌ను ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.మృతుల్లో ఒక భారతీయుడు( Indian ) సహా ముగ్గురు పాకిస్తానీలు వున్నారు.అల్ దైద్ బ్రిడ్జి – అల్ జుబైర్ డిస్ట్రిక్ట్ మధ్య బుధవారం తెల్లవారుజామున 5.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని ఖలీజ్ టైమ్స్ నివేదించింది.పికప్ వ్యాన్‌ను( Pickup Van ) నడుపుతున్న డ్రైవర్.హైవే కుడివైపు లేన్‌ను చెక్ చేయకుండా ఎంట్రీ పాయింట్ నుంచి షార్జా-దైద్ రోడ్‌లోకి ప్రవేశించడంతో ప్రమాదం జరిగిందని షార్జా పోలీస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కల్నల్ అబ్ధుల్లా అల్ దుఖాన్( Colonel Abdullah Al Dukhan ) తెలిపారు.

 Indian 3 Pakistanis Killed In Road Accident In Sharjah Details, Sharjah Road Ac-TeluguStop.com

వేగంగా వెళ్తున్న ట్రక్ డ్రైవర్ కూడా వాహనం ఆకస్మాత్తుగా లేన్‌లోకి ప్రవేశిస్తుందని ఊహించలేదన్నారు.ఈ క్రమంలోస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన వెల్లడించారు.

ప్రమాదంపై ఆపరేషన్స్ రూమ్‌కి సమాచారం అందడంతో వెంటనే అంబులెన్స్, సహాయక బృందాలను ఘటనాస్థలికి పంపారు.ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ సురక్షితంగానే బయటపడినట్లుగా పోలీసులు తెలిపారు.

నలుగురు ప్రయాణీకుల మృతదేహాలను అల్ కువైట్ హాస్పిటల్‌( Al Kuwait Hospital ) మార్చురీకి తరలించారు.

Telugu Al Dhaid Bridge, Al Kuwait, Al Zubair, Colonelabdullah, Indian, Pickup Va

ఇదిలావుండగా.ఏప్రిల్‌లో అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్ఆర్ఐ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.వివరాల్లోకి వెళితే.

మృతుడిని 47 ఏళ్ల విశ్వచంద్ కొల్లాగా గుర్తించారు.ఇతను బోస్టన్‌లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మిత్రుడిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు.

ఈ క్రమంలో విమానాశ్రయంలోని టెర్మినల్ బీ సమీపంలో తన కారు వద్ద వేచి వుండగా.అదే సమయంలో డార్ట్‌మౌత్ ట్రాన్స్‌పోర్టేషన్ మోటార్ కోచ్ అతని కారును వేగంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విశ్వచంద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Telugu Al Dhaid Bridge, Al Kuwait, Al Zubair, Colonelabdullah, Indian, Pickup Va

ఇక లెక్సింగ్టన్‌లో నివసిస్తున్న విశ్వచంద్ డేటా సైంటిస్ట్‌. ఇటీవలే టకేడాలో డేటా అనలిటిక్స్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.గతంలో జాన్ హాన్‌కాక్, డెలాయిట్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, ఐబీఎం, సన్ మైక్రోసిస్టమ్స్‌లో మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు.

అంతేకాదు.అమెరికాలోని ప్రవాస తెలుగు సంఘాలతోనే విశ్వచంద్‌కు బలమైన సంబంధాలున్నాయి.

ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్, గ్రేటర్ బోస్టన్ తెలుగు అసోసియేషన్‌లో ఈయన యాక్టీవ్ మెంబర్‌గా తెలుస్తోంది.విశ్వచంద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు వున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube