మేధో సంపత్తి హక్కులు, ఆధునికీకరణపై బ్రిటన్‌తో పని చేస్తున్నాం : లండన్‌లో సీఏలతో పీయూష్ గోయల్

భారతదేశం మేథో సంపత్తి హక్కులు, ఆధునికీకరణపై యూకేతో కలిసి పనిచేస్తుందన్నారు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్.

( Piyush Goyal ) బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చల నిమిత్తం లండన్( London ) వచ్చిన ఆయన బుధవారం సాయంత్రం ఇక్కడి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)యూకే చాప్టర్ ఆధ్వర్యంలో భారత సంతతికి చెందిన సీఏలు నిర్వహించిన సమావేశానికి గోయల్ హాజరయ్యారు.

ఈయన గతంలో సీఏగా పనిచేసిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో పర్యావరణం, సామాజిక, కార్పోరేట్ గవర్నెన్స్ , మేథోపరమైన హక్కులు (ఐపీ) , కార్పోరేషన్ పన్నుతో సహా అనేక అంశాలను కవర్ చేసేలా పలు ప్రశ్నలకు పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు.

భారత ఆర్ధిక వ్యవస్థ( Indian Economy ) వేగవంతమైన వృద్ధికి సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలతో సామరస్యమయ్యే ప్రక్రియ ఈ ఎజెండాలో ఎక్కువగా వుందని ఆయన తెలిపారు.ఆయా రంగాల్లో భారతీయ ప్రోటోకాల్‌ను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

ఇది క్రమ క్రమంగా జరగాలని తాను భావిస్తున్నానని పీయూష్ గోయల్ వెల్లడించారు.అలాగే భారతదేశంలో నాణ్యతా ప్రమాణాలపైనా తాము చురుకుగా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

ఆహారేతర ఉత్పత్తుల కోసం బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్),( BIS ) ఆహార ఉత్పత్తులపై ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)లు( FSSAI ) ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయని పీయూష్ గోయల్ వెల్లడించారు.

సాధ్యమైన చోట .తాము అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.వచ్చే మూడు నాలుగేళ్లలో భారతీయ ప్రమాణాలు ప్రపంచస్థాయిలో ఆమోదించబడతాయని పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్ - యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) చర్చల దశలో వుందన్నారు.భారతదేశంలో కార్పోరేట్ పన్ను స్థాయిల గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.భారత్‌లో పన్ను రేట్లు గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో గణనీయంగా తగ్గించబడ్డాయన్నారు.

కాగా.యూకేతో( UK ) 11వ రౌండ్ ఎఫ్‌టీఏ చర్చలకు గాను మూడు రోజుల పర్యటన నిమిత్తం పీయూష్ గోయల్ లండన్‌లో అడుగుపెట్టారు.ఈ ప్రక్రియ మరింత వేగవంతం కావడానికి గాను .ఆయన బ్రిటీష్ వాణిజ్య శాఖ మంత్రి కెమీ బాడెనోచ్‌ను కలిశారు.ఈ సమావేశం తర్వాత కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఎఫ్‌టీఏ విషయంలో గణనీయమైన పురోగతి సాధించామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు