నేడు భారత్ వర్సెస్ నెదర్లాండ్స్..భారీ రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ..!

భారత జట్టు సొంత గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023( ODI World Cup 2023 ) టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచులలో వరుస విజయాలను సాధించి అందరికంటే ముందుగానే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క ఓటమి కూడా చవిచూడని జట్టు ఏదంటే అది భారత జట్టే.

నేడు బెంగుళూరు వేదికగా భారత్ వర్సెస్ నెదర్లాండ్స్( India vs Netherlands ) మధ్య జరిగే మ్యాచ్ తో ఈ టోర్నీలో లీగ్ మ్యాచ్లు పూర్తవుతాయి.నేడు జరిగే మ్యాచ్లో నెదర్లాండ్స్ జట్టును ఓడించడం భారత జట్టుకు పెద్ద కష్టమేం కాదు.కానీ ఈ మ్యాచ్లో భారత్ కు గట్టి పోటీ ఇవ్వాలని నెదర్లాండ్స్ జట్టు గట్టి పట్టుదలతో ఉంది.

నేడు జరిగే మ్యాచ్ లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma )ఓ భారీ రికార్డు అందుకునే అవకాశం ఉంది.కేవలం రోహిత్ శర్మ మరో 12 పరుగులు చేస్తే.

భారత జట్టు కెప్టెన్ గా అన్ని ఫార్మాట్లలో కలిపి 14 వేల పరుగులు పూర్తి అవుతాయి.

Advertisement

దీంతో అన్ని ఫార్మాట్లలో 14 వేల పరుగులు చేసిన కెప్టెన్ గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించనున్నాడు.టీ20, వన్డేలు, టెస్టులు, ఐపీఎల్ లలో కలిపి రోహిత్ శర్మ ఇప్పటివరకు 13988 పరుగులు చేశాడు.మరో 12 పరుగులు చేస్తే 14,000 పరుగులు పూర్తి అవుతాయి.

అంతేకాదు నేడు జరిగే మ్యాచ్లో రోహిత్ శర్మ మరికొన్ని రికార్డులను కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంది.కేవలం మరో నాలుగు ఫోర్లు కొడితే భారత జట్టు కెప్టెన్ గా వన్డే లలో 100 ఫోర్లు పూర్తి చేసుకుంటాడు.

మరో 108 పరుగులు చేస్తే భారత జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ వన్డేల్లో 2000 పరుగులు పూర్తి చేసుకుంటాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021
Advertisement

తాజా వార్తలు