నవంబర్ 30వ తారీకు తెలంగాణ పోలింగ్( Telangana Polls ) ముగియటం తెలిసిందే.డిసెంబర్ మూడో తారీకు ఫలితాలు రాబోతున్నాయి.
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చాలా ఏజెన్సీల ఎగ్జిట్ పోల్స్( Exit Polls ) ప్రకటించడం జరిగాయి.ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్( India Today Exit Polls ) ప్రకటించడం జరిగింది.
ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 63 నుంచి 73 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 34 నుండి 44 స్థానాలు, బీజేపీ 4 నుండి 8… ఇతరులు 5 నుండి 8 స్థానాలు వస్తాయని స్పష్టం చేయడం జరిగింది.ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ తో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇదిలావుంటే బీఆర్ఎస్ పార్టీకి( BRS ) చెందిన కీలక నాయకులు.చాలా సందర్భాలలో ఎగ్జిట్ పోల్స్ తలకిందులు అయ్యాయని తామే అధికారంలోకి వస్తామని అంటున్నారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడోసారి జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలలో హోరాహోరీగా పార్టీలు.ప్రచారంలో దూసుకుపోయాయి.ప్రజలకు భారీ ఎత్తున హామీలు ప్రకటించడం జరిగింది.ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి( Congress ) చెందిన నాయకులు ప్రచారం విషయంలో కీలకంగా రాణించారు.
కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు రాహుల్, ప్రియాంక, సోనియా… మరి కొంతమంది పార్టీ పెద్దలు భారీ ఎత్తున తెలంగాణలో ప్రచారంలో పాల్గొన్నారు.కాగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అనేది పార్టీలో సస్పెన్స్ గా మారింది.







