పేదరికం లేని భారత్ నిర్మాణం జరగాలి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైయ్యాయి.ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి ప్రసంగిస్తున్నారు.

 India Should Be Built Without Poverty.. President Draupadi Murmu-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనందంగా ఉందని ముర్ము తెలిపారు.కొన్ని రోజుల కిందట ఆజాదీ కా అమృత్ ఉత్సవం జరుపుకున్నామన్నారు.

భారత్ ను ప్రపంచం చూసే దృష్టి మారిందని ద్రౌపది ముర్ము తెలిపారు.రాబోయే 25 ఏళ్లు భారత్ కు ఎంతో కీలకమని చెప్పారు.

దేశం ఆత్మనిర్భర్ భారత్ గా మారుతుందన్న ఆమె పౌరులందరి అభివృద్ధే ప్రభుత్వం పని చేస్తోందని వెల్లడించారు.పేదరికం లేని భారత్ నిర్మాణం జరగాలని స్పష్టం చేశారు.

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు.

ప్రపంచ దేశాలు భారత్ పై ఆధారపడే పరిస్థితి వచ్చిందని ముర్ము పేర్కొన్నారు.

తొమ్మిదేళ్ల పాలనపై విశ్వాసం పెరిగిందన్నారు.అవినీతి అంతంగా అడుగులు పడుతున్నాయని, అత్యంత వేగంగా పని చేసే ప్రభుత్వం ఇప్పుడు ఉందని ద్రౌపది ముర్ము వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube