కెనడాలో విషాదం చోటు చేసుకుంది.రోడ్డు ప్రమాదంలో 17 ఏళ్ల భారత సంతతి వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే.తరెన్ సింగ్ లాల్ తన టెస్లా కారుపై ఇంటికి వెళ్తుండగా బ్రిటీష్ కొలంబియా లాంగ్లీలోని ఫ్రేజర్ హైవే, 228వ స్ట్రీట్ జంక్షన్ సమీపంలో ఒక యుటిలిటీ పోల్‌ను ఢీకొట్టింది.
సమాచారం అందుకున్న లాంగ్లీ రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.లాల్.
సర్రేలోని తమనావిస్ సెకండరీ స్కూల్‌లో చదువుకుంటున్నాడు.
ఈ ఘటనపై అతని తల్లి ఓమ్ని న్యూస్‌తో మాట్లాడుతూ.
ప్రమాదానికి ముందు తన కుమారుడితో మాట్లాడానని అంతలోనే ఈ దారుణం జరిగిందని కన్నీటి పర్యంతమైంది.ప్రతికూల వాతావరణ పరిస్ధితులే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.
లాల్ కుటుంబానికి, ముఖ్యంగా అతని 12 ఏళ్ల సోదరికి మద్ధతుగా GoFundMe పేజీని ఏర్పాటు చేశారు.క్రీడలలో అద్భుత ప్రతిభ చూపి, భవిష్యత్తులో పోలీస్ శాఖలో చేరాలని లాల్ కలలు కన్నాడని.
కానీ ఇవన్నీ కల్లలే అయ్యాయాని అతని కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది.ఇకపోతే.గత నెలలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కెనడాలో బస్సు బోల్తా పడిన ఘటనలో భారత సంతతి వ్యక్తి సహా నలుగురు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.రహదారిపై పేరుకుపోయిన మంచు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
మృతి చెందిన భారతీయుడిని పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరానికి చెందిన కరణ్‌జిత్ సింగ్ సోధి (41)గా గుర్తించారు.
డిసెంబర్ 24న వాంకోవర్ – కెలోవ్నా మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సర్రే కేంద్రంగా పనిచేస్తున్న పంజాబీ వార్తాపత్రిక అకల్ గార్డియన్ ఎడిటర్ గుర్‌ప్రీత్ ఎస్ సహోటా ట్వీట్ చేశారు.ఇక కరణ్‌జిత్ ఒకానగాన్ వైనరీకి చెందిన రెస్టారెంట్‌లో చెఫ్‌గా ఉద్యోగం చేస్తున్నాడని.తన భార్య, కుమారుడు, కుమార్తెను పంజాబ్‌లోనే వుంచి అతను కెనడాకు వచ్చినట్లు గుర్‌ప్రీత్ తెలిపారు.