చివరి టీ20 లో భారత్ ఓటమి.. సిరీస్ గెలిచిన వెస్టిండీస్..!

వెస్టిండీస్( West Indies ) పర్యటనలో భాగంగా జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ ఫ్లోరిడాలోని లాడర్ హిల్ వేదికగా ఆదివారం జరిగింది.తొలి రెండు మ్యాచ్లలో వెస్టిండీస్ విజయం సాధించగా, తర్వాతి రెండు మ్యాచ్లలో భారత్ విజయాలు సాధించడంతో సిరీస్ 2-2 గా నిలిచింది.

 India Lost In The Last T20.. West Indies Won The Series..!, Sanju Samson, Sport-TeluguStop.com

ఐదవ టీ20 మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఓడిన భారత్ 2-3 తో సిరీస్ కోల్పోయింది.భారత్ కీలకమైన మ్యాచ్ లో తన సత్తా చూపించలేకపోయింది.

Telugu India, Latest Telugu, Sanju Samson, Tilak Varma-Sports News క్రీ

ఐదో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.భారత జట్టు బ్యాటర్లైన సూర్య కుమార్ యాదవ్ 61( Suryakumar Yadav ), తిలక్ వర్మ 27 పరుగులతో కాస్త రాణించారు.మిగిలిన భారత జట్టు బ్యాటర్లు చెప్పుకోదగ్గ పరుగులు నమోదు చేయలేక తొందరగా పెవిలియన్ చేరారు.వెస్టిండీస్ బౌలర్లైన రోమరియో షెఫర్డ్ 4 వికెట్లు, హోల్డర్ 2 వికెట్లు, హెసెన్ 2 వికెట్లు తీశారు.

Telugu India, Latest Telugu, Sanju Samson, Tilak Varma-Sports News క్రీ

అనంతరం లక్ష్య చేదనాకు దిగిన వెస్టిండీస్ జట్టు 18 ఓవర్లలో రెండు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని చేదించి టైటిల్ కైవసం చేసుకుంది.వెస్టిండీస్ జట్టు బ్యాటర్లైన బ్రాండన్ కింగ్ 55 బంతుల్లో 85 పరుగులు, నికోలస్ పూరన్ 35 బంతుల్లో 47 పరుగులతో రాణించడం వల్ల వెస్టిండీస్ ఘనవిజయం సాధించింది.భారత జట్టు బౌలర్లైన అర్షదీప్ సింగ్ ఒక వికెట్, తిలక్ వర్మ ఒక వికెట్ చొప్పున తీశారు.మిగిలిన భారత బౌలర్లు భారీ పరుగులు సమర్పించుకున్నారు.ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు బ్యాటింగ్లో వైఫల్యం పొందితే.భారత బౌలర్లు బౌలింగ్లో వైఫల్యం పొందడం స్పష్టంగా కనిపిస్తోంది.

కాస్త మెరుగుగా ఆడి ఉంటే మ్యాచ్ గెలిచే అవకాశం ఉండేది.ఇక వెస్టిండీస్ జట్టు ప్లేయర్ రోమరియో షెఫర్డ్( Romario Shepherd ) కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

నికోలస్ పూరన్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube