చైనాకు భారత్ అంటే వణుకు.. ఈ సర్వే ఫలితాలు తెలిస్తే మీరూ ఒప్పుకుంటారు..

చైనాలోని సింఘువా యూనివర్శిటీ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం, కేవలం ఎనిమిది శాతం మంది చైనా( China ) పౌరులు మాత్రమే భారతదేశాన్ని మిత్ర దేశంగా భావిస్తున్నారు.యునైటెడ్ స్టేట్స్, జపాన్‌ల( United States, Japan ) కంటే ఇండియా అంటేనే తమకు భయమని మీరు సర్వేలో తెలిపారు.యూఎస్ అంటే 12.2 శాతం, జపాన్ అంటే 13 శాతం మంది భయమని పేర్కొన్నారు.సర్వేలో పాల్గొన్న 41.5 శాతం మంది భారతదేశం గురించి తటస్థ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని సర్వే వెల్లడించింది.

 India Is A Tremor For China If You Know The Results Of This Survey You Will Also-TeluguStop.com

ఈ సర్వే అంతర్జాతీయ( International ) భద్రతా సమస్యలపై దృష్టి సారించింది.కోవిడ్-19 చైనా పౌరులకు ప్రధాన ఆందోళనగా ఉందని, తైవాన్‌లో అంతర్జాతీయ జోక్యం, యునైటెడ్ స్టేట్స్, చైనా మధ్య శత్రుత్వం గురించి కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు.82 శాతం మంది పార్టిసిపెంట్ల ప్రకారం, యూఎస్ చైనా భద్రతా వాతావరణంపై అత్యధిక ప్రభావాన్ని చూపుతోంది, అయితే దాదాపు 60 శాతం మంది రష్యాను అనుకూలమైన దేశంగా భావించారు.

చైనా, భారత్ సరిహద్దు విషయమై గతంలో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే.ఇరుదేశాల సైనికులు ఒకానొక సమయంలో గల్వాన్ లోయలో తలపడి ప్రాణాలను కూడా విడిచారు.ఇక ఇటీవల కాలంలో చైనా ఇండియాను విమర్శిస్తూ వస్తోంది.

ఈ చర్యలు ప్రజల్లో భారతదేశం పట్ల భయాన్ని, శత్రుత్వాన్ని పెంచి పోషించాయని తెలుస్తోంది.మరోవైపు వచ్చే ఐదు నుంచి పదేళ్లలో చైనా, భారత్‌ల మధ్య సంబంధాలు కష్టతరంగా మారుతాయని భారత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అంచనా వేశారు.

Reasons why China is so scared of India

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube