వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా( America ) వెళ్లిన భారతీయులు అక్కడ కీలక స్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా అక్కడి రాజకీయాల్లో భారతీయుల ప్రాబల్యం నానాటికీ పెరుగుతోంది.
సెనేటర్లు, మేయర్లు, కాంగ్రెస్ సభ్యులుగా భారతీయులు రాణిస్తున్నారు.ఇప్పుడు ఏకంగా అమెరికా ఉపాధ్యక్ష పదవిలో భారత మూలాలున్న కమలా హారిస్( Kamala Harris ) వుండటం మనమంతా గర్వించాల్సిన విషయం.
ఇదిలావుండగా.భారత సంతతికి చెందిన రెజనీ రవీంద్రన్ (40)( Rejani Raveendran ) అనే కళాశాల విద్యార్ధిని విస్కాన్సిన్ నుంచి సెనేట్ బరిలో నిలిచారు.
ఈ మేరకు తన బిడ్‌ను అధికారికంగా ప్రకటించారు.అంతేకాదు.
డెమొక్రాటిక్ సెనేటర్ టామీ బాల్డ్‌విన్‌పై అధికారికంగా పోటీ చేయనున్న తొలి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా రెజనీ చరిత్ర సృష్టించారు.

యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ స్టీవెన్స్ పాయింట్ కాలేజ్ రిపబ్లికన్ ఛైర్‌గా వున్న రవీంద్రన్ మంగళవారం పోర్టేజ్ కౌంటీలో 61 ఏళ్ల బాల్డ్‌విన్‌పై( Tammy Baldwin ) పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ప్రైమరీకి ఇంకా ఏడాది మాత్రమే సమయం వున్నట్లు మిల్వాకీ జర్నల్ సెంటినెల్ పేర్కొంది.ఈ సందర్భంగా రెజనీ మాట్లాడుతూ.
తాను చాలా మంది రాజకీయ నాయకులు, లాబీయిస్టులు, విధాన రూపకర్తలను కలిశానని అన్నారు.వారిలో చాలా మంది దాదాపు 20, 30, 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో వున్నారని ఆమె చెప్పారు.
తాము వారిని ఎన్నుకుని చట్టసభలకు పంపితే వారు వాషింగ్టన్ డీసీలో చాలా సుఖంగా వుంటారని రెజనీ చురకలంటించారు.మా గురించి మరిచిపోయినప్పుడు.
వారిని అక్కడికి పంపడం ఎందుకని ఆమె ప్రశ్నించారు.

ముగ్గురు పిల్లల తల్లి అయిన రెజనీ రాజకీయాలకు కొత్త.ఈ ఏడాదే స్టీవెన్స్ పాయింట్ కాలేజ్ రిపబ్లికన్‌లలో చేరింది.ఈ వేసవిలో వాషింగ్టన్( Washington ) పర్యటన అనంతరం సెనేట్‌కు పోటీ చేయాలని రెజనీ నిర్ణయించుకున్నారు.
ఆమె వచ్చే ఏడాది పొలిటికల్ సైన్స్‌లో( Political Science ) బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేయాలని యోచిస్తోంది.రెజనీ 2015లో అమెరికా పౌరసత్వం పొందారు.
సరిహద్దు భద్రత, ఫెంటానిల్ వంటి నిషేధిత మాదకద్రవ్యాలను అరికట్టడం, అక్రమ వలసలను అడ్డుకోవడం వంటి వాటిపై దృష్టి పెడతానని ఆమె పేర్కొన్నారు.తాను 2016, 2020లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్ధతిచ్చానని, 2024లోనూ ఆయనకే తాను మద్ధతిస్తున్టన్లు రెజనీ చెప్పారు.







