ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది.ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు వైఎస్ఆర్ సీపీ గూటికి చేరుతున్నారు.
త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వలసల జోరు మరింత పెరిగింది.తాజాగా ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) సమక్షంలో వివిధ జిల్లాలకు చెందిన పలువురు నాయకులు వైఎస్ఆర్ సీపీ లో చేరారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విజయవాడకు చెందిన టీడీపీ మాజీ కార్పొరేటర్లతో పాటు జనసేన పార్టీకి చెందిన పలువురు నేతలు వైఎస్ఆర్ సీపీలో చేరారు.సీఎం జగన్ సమక్షంలో జనసేన( Janasena) విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంఛార్జ్ బత్తిన రాము, మాజీ కార్పొరేటర్లు గండూరి మహేశ్, నందెపు జగదీశ్, మాజీ కో ఆప్షన్ మెంబర్ కొక్కిలిగడ్డ దేవమణి, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ కోసూరు సుబ్రహ్మణ్యం (మణి)తో పాటు మాజీ డివిజన్ అధ్యక్షులు గోరంట్ల శ్రీనివాస రావు వైఎస్ఆర్ సీపీలో చేరారు.ఈ మేరకు సీఎం జగన్ వీరందరికీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ చేరికల కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి దేవినేని అవినాశ్ తో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు.ఒక్క విజయవాడే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన కీలక నేతలు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నారు.ఇందులో భాగంగా విశాఖకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, జనసేన నాయకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలికారు.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు వైఎస్ఆర్ సీపీ అధిష్టానం ఇప్పటికే అభ్యర్థులు ఖరారు చేసిన సంగతి తెలిసిందే.మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యే స్థాయి నేతలు పలువురు వైఎస్ఆర్ సీపీలో చేరేందుకు క్యూ కట్టారు.
ఈ క్రమంలో ఒకే రోజులో సుమారు ఎనిమిది నియోజకవర్గాలకు చెందిన నేతలు వైఎస్ఆర్ సీపీ కండువాలు కప్పుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు.ప్రస్తుతం వైఎస్ఆర్ సీపీ పార్టీ( YSRCP Party ) ప్రభంజనం ఏ విధంగా కొనసాగుతుందోనని.
అంతేకాదు ప్రతి ఒక్కరూ పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ ప్రభుత్వమే వస్తుందని ఘంటాపథంగా చెబుతుండటం విశేషం.