గత వంద సంవత్సరాలుగా ఆదివారం వాటిక్కూడా సెలవేనట?

ఈ ప్రపంచంలో దాదాపు అందరికీ, అన్నిటికీ బహుశా ఆదివారమే సెలవు ఉంటుంది.

ఈ ఆచారం ఎక్కడినుండి వచ్చిందో అప్రస్తుతం కానీ, ఆదివారం అనగానే మనలో ప్రతిఒక్కరికీ హమ్మయ్య.

ఈరోజు రెస్టు తీసుకోవచ్చు అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు.వారాంతం కస్టపడి ఆరోజు మాత్రం విశ్రాంతి తీసుకోవాలని ఎవరికి ఉండదు.

ఈ క్రమంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే పాఠశాలలకు, కళాశాలలకు, కార్యాలయాలకు, ఇతర ప్రైవేట్ సంస్థలకు ఆదివారాలు మాత్రం సెలవు ఉంటుంది.వారానికో సెలవు ప్రకటించడం వల్ల ప్రజలు మానసికంగా, శారీరకంగా దృఢంగా వుంటారనే ఆలోచననుండి ఈ ఆదివారం( Sunday ) సెలవు అనేది వచ్చింది.

అయితే ఇలా మనుషులకు సెలవు ఉండటం గురించి అందరికీ తెలిసిందే.కానీ జంతువులకు ఆదివారం సెలవు అనేమాట ఎక్కడన్నా విన్నారా? కానీ ఓ దేశంలో పశు, పక్షులకు కూడా ఆదివారం సెలవు.మనుషులకే కాదు జంతువులకు కూడా వారంలో ఒక రోజు సెలవు ఇవ్వాలి అది కూడా ఆదివారమే ఇవ్వాలని జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లా( Jharkhand )లో నిర్ణయించారు.

Advertisement

ఈ రాష్ట్రంలో మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా విశ్రాంతి అవసరమని స్థానికులు నమ్మకం.అందుకని పశువులకు( Cattle ) కూడా ఆదివారం సెలవు ఇస్తారు.

అంటే ఆ రోజు పశువులకు కేవలం మేత మాత్రమే ఇస్తారు.వాటిచేత ఎటువంటి పనులు చేయించరు.ఈ సంప్రదాయాన్ని ఆ జిల్లాలోని దాదాపు 20 గ్రామాల ప్రజలు గత 100 ఏళ్లకు పైగా అనుసరిస్తున్నారు.

హర్ఖా, మోంగర్, పరార్, లాల్‌గాడి ఇలా.ఇతర గ్రామాల ప్రజలు తమ పశువులతో ఆదివారం పని చేయించరు.అదేవిధంగా పాలిచ్చే జంతువులకు పాలు కూడా తీయరట.

ఆ రోజు పూర్తిగా పశువులకు కావాల్సిన మేత, పచ్చ గడ్డిని ఇస్తారు.వందేళ్ల క్రితం ఓ ఎద్దు పొలంలో దున్నుతున్న సమయంలో కింద పడి చనిపోయిందట.

వైరల్ వీడియో : ఇలాంటి వికృతానందం సరి కాదంటూ హెచ్చరిక చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
వైరల్ : తల్లిదండ్రుల ప్రేమకు మించి మరొక ప్రేమ లేదనడానికి ఇదే ఉదహరణ కాబోలు..

అప్పుడు ప్రజలు ఎద్దు ఎక్కువ పని చేయడం వల్లనే అలా జరిగిందని, వీటికి కూడా మనుషులకు మల్లే విశ్రాంతి అవసరం అని వారికి అప్పుడు తట్టిందట.

Advertisement

తాజా వార్తలు