తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇస్తుంటే ఇక షాడో టీమ్ ఎందుకని ప్రశ్నించారు.
అధికారం పోయిందన్న బాధలో కేటీఆర్ మాట్లాడుతున్నారని తెలిపారు.
అసెంబ్లీలో బావ బావమరుదుల ఆరాటమే కనిపించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
సైనిక్ స్కూల్ ఎందుకు ఆగిందో బీఆర్ఎస్ నేతలే చెప్పాలన్నారు.అలాగే రాష్ట్రంలో టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదన్న ఆయన ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు.త్వరలోనే పోటీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
అయితే ఉద్యోగ నియామకాలు జరగాలంటే ఛైర్మన్ నియామకం జరగాలన్న రేవంత్ రెడ్డి ఈ అంశంపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.అదేవిధంగా అసెంబ్లీలో తాము విడుదల చేసిన శ్వేతపత్రంలో వాస్తవాలే చెప్పామని వెల్లడించారు.