ప్రతి సీరియల్ లో హీరోకు ఇద్దరు భార్యలు.. సమాజానికి ఏం చెప్తున్నారంటూ లాంగ్ నోట్!

బుల్లితెరపై ప్రస్తుతం సీరియల్స్ హవా బాగా నడుస్తుందనే చెప్పవచ్చు.ఈ సీరియల్స్ హవా అనేది ముందు తరాల నుంచి వస్తూనే ఉంది.

 In Every Serial The Hero Has Two Wifes What Are You Saying To The Society Detail-TeluguStop.com

ప్రస్తుతం వెండితెర కంటే ఎక్కువగా బుల్లితెరపై బాగా ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు.నిజానికి సీరియల్స్ కి బాగా ఆకర్షితులవుతున్నారు.

సీరియల్ సమయం ప్రారంభం కాగానే సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం ఆ సమయంలో ఎన్ని పనులు ఉన్నా వదులుకొని మరి చూస్తున్నారు.

ఒకప్పుడు సీరియల్ లలో మంచి మంచి కథలు ప్రసారమయ్యేవి.

కానీ ఇప్పుడు వస్తున్న సీరియల్స్ లో అన్ని కథలు ఒకలాగే ఉన్నాయి.ముఖ్యంగా ఒక మగవాడి కోసం ఇద్దరు ఆడవాళ్లు కొట్లాడుతున్న కథలను తీసుకొని వస్తున్నారు డైరెక్టర్లు.

దీంతో ప్రేక్షకులు కూడా మొదట్లో ఆసక్తి చూపిన అన్ని సీరియల్లలో ఇదే రొటీన్ కథ నడుస్తుంది అని సీరియల్ చూడటం కూడా మానేశారు.

హీరో కోసం హీరోయిన్ తో పాటు లేడీ విలన్ కూడా హీరో కోసమే తాపత్రయ పడుతుండడం.

ఇక లేడి విలన్ హీరోయిన్ తో గొడవ పడటం లాంటివి ప్రతి సీరియల్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ ని తీసుకున్నట్లయితే అందులో కార్తీకదీపం సీరియల్ గురించి అందరికీ తెలిసిందే.

Telugu Devatha Serial, Ennennojanmala, Karthika Deepam, Serial, Maa Serials, Tel

ఇక ఈ సీరియల్ లో మొదటినుంచి హీరో డాక్టర్ బాబు కోసం దీపతో పాటు విలన్ మోనిత చివరి వరకు ఏం చేసిందో చూశాం.ఇక ఇప్పుడు సెకండ్ సీజన్ లో కూడా ఇద్దరు అమ్మాయిలు హీరో కోసం కొట్లాడుకుంటున్నారు.గుప్పెడంత మనసులో కూడా ఈమధ్య లేడీ విలన్ సాక్షి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ వసుతో హీరో రిషిని నాకిచ్చి వదిలేయ్ అంటూ కొట్లాడుతుంది.

ఇక దేవత సీరియల్ లో కూడా ఏకంగా తన చెల్లి కోసం భర్తనే త్యాగం చేసింది.

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో కూడా పెళ్లి చేసుకున్న మగవాడిపై మరో ఆడది మనసు పారేసుకోవటంతో చేసేదేమీ లేక ఆ ఇంటి గృహలక్ష్మి తన భర్తను త్యాగం చేస్తుంది.ఇక ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో చూసినట్లయితే హీరో భార్య లేచిపోయి మరొకరిని వివాహం చేసుకోగా.

ఒంటరిగా ఉన్న హీరో జీవితంలోకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి పెళ్లి చేసుకుంటుంది.

Telugu Devatha Serial, Ennennojanmala, Karthika Deepam, Serial, Maa Serials, Tel

కేవలం స్టార్ మా లో వచ్చే సీరియల్స్ లోనే కాదు ఇతర ఛానల్స్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో కూడా ఒక హీరో కోసం ఇద్దరు అమ్మాయిలు పోట్లాడే కథలనే చూపిస్తున్నారు డైరెక్టర్లు.ఇక ఈ సీరియల్స్ చూసే ప్రేక్షకులు కూడా ఈ సీరియల్స్ అన్ని ఒకేలా ఉన్నాయి పలుమార్లు కామెంట్లు కూడా పెట్టారు.ఏమి సీరియల్స్ రా బాబు అంటూ.

ఇద్దరు పెళ్ళాలు నలుగురు పిల్లలు.ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అని.

ఈ సీరియల్స్ వల్ల అందరిని చెడగొడుతున్నారు కదా.మంచి సీరియల్స్ ఉంటే చెయ్యండి కానీ.సమాజాన్ని నాశనం చేసే సీరియల్స్ చేయకండి అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.ఒక సీజన్లో అలానే జరిగింది అంటే మరో సీజన్లో కూడా అటువంటి కథతోనే ముందుకు వస్తున్నారు సీరియల్ డైరెక్టర్లు.

అందుకే సీరియల్ రేటింగ్స్ కూడా తగ్గుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube