శబరిమల కు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు ముఖ్య గమనిక..?

మన కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల దేవాలయ( Sabarimala Temple ) ప్రారంభంతో భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది.

శబరిమల అంత అయ్యప్ప నామస్మరణతో మారిమోగిపోతోంది.

మన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప స్వామి ( Ayyappa Swami )దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.ఇంకా చెప్పాలంటే శబరిమలలో భక్తుల దర్శనంతో పాటే భారీ వర్షాలు కూడా మొదలయ్యాయి.

వాస్తవానికి ఈశాన్య రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చడంతో కేరళలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.పైగా శబరిమల ఉన్న కేరళలోని పతనంతిట్ట జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నట్లు సమాచారం.

అలాగే తమిళనాడు తీర ప్రాంతాలకు ఆనుకొని ఉన్న నైరుతి మధ్య పశ్చిమ బెంగాల్ లో అల్పపీడన ద్రోణి కారణంగా రుతుపవనాల వర్షాలు మళ్లీ మొదలయ్యాయి.

Important Note For Ayyappa Swamy Devotees Going To Sabarimala , Sabarimala Te
Advertisement
Important Note For Ayyappa Swamy Devotees Going To Sabarimala , Sabarimala Te

ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ అప్రమత్తమై, మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.కేరళలోని తిరువనంతపురం, ఇడుక్కి, పఠన్‌తిట్ట జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.కన్నూరు, కాసర్‌గోడ్‌ తో అటు మిగిలిన జిల్లాలకు కూడా ఐఎండి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఇంకా సమస్య ఏమిటంటే శబరిమల సీజన్ ఇప్పుడు ఇప్పుడే మొదలు కావడం అయ్యప్పను దర్శించుకునేందుకు పతనంతిట్ట జిల్లాలోని శబరిమలకు పలువురు భక్తులు మాలధారణ వేసుకుని వచ్చారు.కాబట్టి ఈ వర్షం భక్తులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వం భావిస్తుంది.

Important Note For Ayyappa Swamy Devotees Going To Sabarimala , Sabarimala Te

శబరిమల అయ్యప్ప దేవాలయంలో ( Sabarimala Ayyappa Temple )మండలం, మకరవిళక్కు పూజ కోసం 16న కాలినడక మార్గం తెరిచారు.దీంతో భక్తులు ఊహించిన దాని కంటే ఎక్కువ రావడంతో రద్దీ నీ నియంత్రించేందుకు దర్శన సమయాన్ని 16 గంటలకు పెంచారు.మరో వైపు ప్రత్యేక రైల్లు, విమానాలు అంటూ రకరకాల ప్రకటనలు కూడా చేశారు.

దీంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని దేవాలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.అదేవిధంగా రానున్న 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025

కాబట్టి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు( Devotees ) తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు