వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌ల‌స‌లు.. గ్రౌండ్ లెవ‌ల్లో చంద్ర‌బాబు మార్క్‌

ఏపీలో జరిగిన 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీకి ఓటర్లు గట్టి షాకిచ్చారు.కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితం చేసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు.2019 నుంచి నిన్న మొన్నటి వరకూ టీడీపీ పరిస్థితి మరీ తీసికట్టుకుపోతుంది.ఎక్కడ ఏ రకమైనా ఎన్నికలు జరిగినా సరే టీడీపీ ఓటమి చెందుతూ వస్తోంది.

 Immigrants From Ycp To Tdp Chandrababu Mark At Ground Level, Ycp, Tdp, Chandra-TeluguStop.com

దీంతో కింది స్థాయి కార్యకర్తలే కాదు నాయకులు కూడా నైరాశ్యంలో కూరుకుపోయారు.కానీ ప్రస్తుతం టీడీపీ పార్టీ మాంచి జోష్ లో కనిపిస్తోంది.

కారణం పార్టీలో జరుగుతున్న పరిణామాలే అని చెబుతున్నారు.ఇందుకు మాజీ అధ్యక్షుడు చంద్రబాబు గ్రౌండ్ లెవెళ్లో చేస్తున్న పనులే కారణమని వివరిస్తున్నారు.

ఇటీవల వైసీపీ నుంచి ప్రతిపక్షంగా ఉన్న టీడీపీలో కి వలసలు పెరుగుతున్నాయట.ఇది టీడీపీ పార్టీకి మరియు పార్టీ కేడర్ కు మంచి కిక్కిచ్చే వార్త.ఎక్కడైనా సరే అధికార పక్షం అంటే మామూలుగా ఉండదు.కానీ ఏపీలో మాత్రం అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి జనం వలస రావడం చూస్తేనే అర్థమవుతుంది.

అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో.ఇక మరో విషయం మొన్న జరిగిన పరిషత్ ఎన్నికల్లో కూడా పలు చోట్ల టీడీపీ జెండా ఎగిరింది.

Telugu Apoltics, Chandra Babu, Janardhan Reddy, Ys Jagan-Telugu Political News

ఫ్యాను ప్రభజంనంలోనూ టీడీపీ బాగానే నెగ్గుకు వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కర్నూలు జిల్లాకు చెందిన దాదాపు 150 వైసీపీ అనుకూల కుటుంబాలు అక్కడి మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువాను కప్పుకున్నారు.ఈ సందర్భంగా జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.వైసీపీ పాలనకు ప్రజలు చరమ గీతం పాడే సమయం ఆసన్నమైందని తెలిపారు.కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా ఇంకో రెండు మూడు చోట్ల కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగాయి.  రాబోయే రెండేండ్ల దాకా కూడా ఈ వ‌ల‌స‌లు ఇలాగే కొన‌సాగితే మాత్రం టీడీపీకి మ‌ళ్లీ పూర్వ వైభ‌వం వ‌స్తుంద‌ని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube