బలగం డైరెక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి.. వివాదంలో డైరెక్టర్ వేణు!

జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వేణు( Venu ) అనంతరం దర్శకుడిగా మారారు.ఈయన దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి చిత్రం బలగం( Balagam ).

 Immediate Action Should Be Taken Against The Director Of The Force Director Venu-TeluguStop.com

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల నేపథ్యంలో నటుడు ప్రియదర్శి( Priyadarshi ) నటి కావ్య కళ్యాణ్ రామ్ ( Kavya Kalyan Ram ) జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం సినిమా ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది.ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద విజయాన్ని అందుకున్నటువంటి ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందనే చెప్పాలి.

ఇలా ఇంత మంచి సినిమాని తీసినందుకు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు డైరెక్టర్ వేణుని స్వయంగా ఇంటికి ఆహ్వానించి సత్కారం చేశారు.

Telugu Balagam, Mptc, Priyadarshi, Venu-Movie

ఇలా మొదటి సినిమాతోనే అద్భుతమైన పనితీరును కనబరిచిన డైరెక్టర్ వేణు పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తూ ఉండగా మరికొందరు మాత్రం ఈయనపై వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ మండిపడుతున్నారు.ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలలో తమ మనోభావాలు దెబ్బతీసేలా డైరెక్టర్ వేణు ఈ సినిమాని తీశారని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల ఎంపీటీసీ( MPTC )లు ఆరోపిస్తున్నారు.ప్రజాప్రతినిధులైన మమ్మల్ని కించపరిచే విధంగా తీసిన సన్నివేశాలు మమ్మల్ని చాలా బాధ పెట్టాయని తహసిల్దార్ మహేశ్వరుని కలిసి వినతి పత్రం అందజేశారు.

Telugu Balagam, Mptc, Priyadarshi, Venu-Movie

ఇందులో భాగంగా బలగం సినిమాలో ఎంపీటీసీలను కించపరుస్తూ తీసినటువంటి సన్నివేశాలను వెంటనే సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా మా మనోభావాలు దెబ్బతీసేలా ఈ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ వేణు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Telugu Balagam, Mptc, Priyadarshi, Venu-Movie

ఈ క్రమంలోనే ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ.బలగం సినిమాకు తెలంగాణ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్న తరుణంలో ఇలా ఎంపీటీసీలుగా, ప్రజాప్రతినిధులమైన మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడిన సన్నివేశాలను తమను ఎంతోగాను బాధించాయని వెంకట్ ఈ సందర్భంగా తెలియజేశారు.మరి ఈ వివాదం పై వేణు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube