కొత్త ఆఫర్లకు నో చెబుతున్న ప్రభాస్ బ్యూటీ.. ప్రభాస్ వల్లే ఈ సమస్య ఎదురైందా?

డార్లింగ్ హీరో ప్రభాస్ ( Darling hero Prabhas )ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ప్రతి ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరికలేకుండా గడుపుతున్నారు.

అందులో భాగంగానే హీరోగా హను రాఘవపూడి ( Hanu Raghavapudi )దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ఫౌజీ కూడా ఒకటి.ఈ చిత్రంలో హీరోయిన్‌ గా నటి ఇమాన్వి ఇస్మాయిల్‌ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా ఈ మూవీ మేకర్స్ సినిమాకు హీరోయిన్ ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న విషయం తెలిసిందే.

అన్ని స్క్రీన్ టెస్టులు, పాత్రకు సరిపోయే లుక్స్, పెర్ఫార్మెన్స్ పరీక్షించి చివరికి ఇమాన్విని సెలెక్ట్ చేశారు.ఇక ఫౌజీ సినిమా ( Fauji movie )షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.

Advertisement

తమిళనాడులో ముఖ్యమైన సన్నివేశాలను దర్శకుడు హను రాఘవపూడి చిత్రీకరించారు.ప్రభాస్ డేట్స్ 2025 సంక్రాంతి తర్వాత అందుబాటులోకి వస్తాయని సమాచారం.

ఇక హీరోయిన్ ఇమాన్వి ఎప్పుడైతే ప్రభాస్ తో నటిస్తోంది అని వార్తలు వచ్చాయో అప్పటి నుంచి ఇంటర్నెట్ వరల్డ్ లో అమ్మడి పేరు తెగ ట్రెండ్ అయ్యింది.

అయితే ఇమాన్వి( Imanvi ) కి ఇప్పటివరకు అనేక పాన్ ఇండియా చిత్రాల నుంచి ఆఫర్స్ వచ్చాయని టాక్.కానీ ఆమె ఆ ఆఫర్స్ ఙ్ ఒప్పుకోవడం లేదట.దానికి ప్రధాన కారణం ఫౌజీ నిర్మాతలు పెట్టిన కండిషన్స్.

ప్రస్తుతం ప్రభాస్ బిజీ షెడ్యూల్స్ కారణంగా షూటింగ్ లోకి ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితి.కాబట్టి హీరోయిన్ డేట్స్ విషయంలో ఇబ్బందులు రాకూడదని ముందే ఫిక్స్ అయ్యారు.

"పోలీస్ అంకుల్.. మా నాన్నను పట్టుకోండి!".. చిన్నోడు కంప్లైంట్‌కు పోలీసులు షాక్!
ఆ ఫ్యామిలీ నట వారసులు ఎందుకు వెనకబడుతున్నారు..?

ప్రస్తుత పెద్ద హీరోయిన్లు డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమని, అందుకే కొత్త నటి ఇమాన్విని తీసుకోవాలని మైత్రీ మూవీ మేకర్స్ ( Mythri Movie Makers )మొదట్లోనే నిర్ణయం తీసుకున్నారట.ఇది ఆమె తొలి సినిమా అయినప్పటికీ, ప్రభాస్ వంటి స్టార్ హీరోతో పనిచేసే అవకాశం ఇమాన్వికి దక్కడం విశేషం.

Advertisement

ఈ కారణంగా ఇమాన్వితో ఏడాది కాలం పాటు కాల్ షీట్స్ బ్లాక్ చేసుకున్నారట.ప్రత్యేకంగా, ఆమెకు బిజినెస్ క్లాస్ ప్రయాణం, 5 స్టార్ హోటల్ విడిది వంటి సౌకర్యాలను కూడా అందించబోతున్నారని తెలుస్తోంది.ఇమాన్వి అమెరికాలో నివసిస్తున్న నేపథ్యంలో ఆమె ప్రాజెక్ట్ కోసం ఎప్పుడైతే ప్రభాస్ షూటింగ్ షెడ్యూల్ కి డేట్స్ అందుబాటులో ఉంటాయో, అప్పుడు వెంటనే రప్పించేలా ఏర్పాట్లు చేసుకున్నారని టాక్.

అందుకే ఆమె ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా ఒప్పుకోవడం లేదట.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా వార్తలు