సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మంది సెలబ్రిటీల ( Celebrities )గురించి అసత్యపు వార్తలు ప్రచారం అవుతున్న విషయం మనకు తెలిసిందే.ఇలా ఆ వార్తలలో నిజం ఉందా లేదా అనే విషయం కూడా పరిగణించకుండా అలాంటి వార్తలను తొందరగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా సెలబ్రిటీల గురించి ఇలాంటి తప్పుడు వార్తలు క్షణాలలో వైరల్ అవుతూ ఉంటాయి.అయితే కొంతమంది సెలబ్రిటీలు బ్రతికి ఉన్నా కూడా సోషల్ మీడియా వారిని చంపేస్తున్నటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు మరణించారంటూ సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొస్తున్నాయి.చివరికి ఈ వార్తలపై సదరు నటీనటులు స్పందిస్తూ మేము బ్రతికే ఉన్నాము అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది.తాజాగా నటుడు కమెడియన్ సుధాకర్ (Sudhakar) ఆరోగ్య పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని ఆయన ఒక హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.మరికొన్ని వెబ్సైట్స్ అయితే ఏకంగా ఈయన మరణించారంటూ( Death Rumours)వార్తలు కూడా రాశారు.
ఇలా సుధాకర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇలాంటి వార్తలు వస్తున్న తరుణంలో చివరికి ఆయన ఈ వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా సుధాకర్ తన గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందించారు.తాను క్షేమంగా ఉన్నానని తన ఆరోగ్య పరిస్థితి కూడా బాగుందని తాను ఇంకా చనిపోలేదు అంటూ చెప్పుకొచ్చారు.సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ అసత్యపు వార్తలను(Fake News) ఎవరు నమ్మకండి, తాను క్షేమంగా ఉన్నానంటూ ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇలా సుధాకర్ ఆరోగ్యం గురించి ఆయన మరణించారు అంటూ వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు ఇదివరకే ఎన్నోసార్లు తన గురించి ఇలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారి ఈయన ఆ వార్తలను ఖండిస్తూ వస్తున్నారు.