సినిమా ఛాన్సులు లేకపోవడంతో ఇల్లి పాప కూడా..!

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ సాధించాక వెంటనే బాలీవుడ్‌పై కన్నేసి అటు జంప్ అవుతుంటారు.ఈ కోవలోకే చెందింది గోవా బ్యూటీ ఇలియానా.

టాలీవుడ్‌లో మంచి ఫాంలో ఉన్నప్పుడే బాలీవుడ్ చెక్కేసిన ఈ బ్యూటీ, అక్కడ కూడా ఫేడవుట్ అవ్వడంతో తిరిగి సౌత్ సినిమాల వైపు చూస్తుంది.ఈ క్రమంలో రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

అయితే ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగలడంతో ప్రస్తుతం ఆడియెన్స్‌కు మరింత దగ్గరయ్యే ప్లాన్ చేస్తోంది.ఈ క్రమంలో ప్రస్తుతం మంచి ఆదరణ పొందుతున్న వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఇలియానా పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఓ మంచి కాన్సెప్ట్ ఉన్న వెబ్‌సిరీస్‌లో నటించేందుకు ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.ఇక ఈ వెబ్ సిరీస్‌లో ఇలియానా లేడీ ఓరియెంటెడ్ రోల్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

మొత్తానికి ఇల్లీ పాప కూడా ఓటీటీకే ఓటెయ్యడంతో ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

మునుపటి కంటే బలంగా ఉన్నా.. చైతూతో విడాకులపై సమంత కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు