తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వం పూర్తయింది.ఆకరి నిమిషం లో ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి అభ్యర్థులు యదా శక్తి ప్రయత్నిస్తున్నారు .
కొంతమంది భారీ ఎత్తున తాయిలాలు ఆశ చూపిస్తుంటే, మరి కొంతమంది బెదిరింపుల పర్వానికి కూడా తెర తీస్తున్నారు.అయితే హుజరాబాద్ బి ఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి( Padi Kaushik Reddy ) మాత్రం ప్రజలను ఎమోషనల్ చేయాలనుకున్నారో లేకా తాను ఎమోషనల్ అయ్యారో తెలియదు కానీ ఒడిపోతే చనిపోతాను అన్న దిశగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి .వచ్చే ఎన్నికలలో హుజురాబాద్( Huzurabad ) అభ్యర్థిగా తనను గెలిపిస్తే విజయ యాత్ర చేసుకుంటానని లేకపోతే తమ కుటుంబ సభ్యులు ముగ్గురు శవ యాత్ర చేసుకుంటామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు .

ఎన్నికలు అన్న తర్వాత విజయం పరాజయం సాధారణమేనని ఇలా ఓటర్లను బెదిరించే తరహాలో వ్యాఖ్యలు చేయటం ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదని రాజకీయ పరిసశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.అయితే తమ ఓటమిని ముందే గ్రహించి ఓటర్ల సానుభూతి పొందే దిశగా ఆయన ఇలాంటి ఎత్తుగడ లకు పాల్పడుతున్నారంటూ ప్రతిపక్షాలు నిందిస్తున్నాయి .ఇప్పటికే ప్రచార గడువు పూర్తయినందున ఇప్పుడు ప్రలోభాల పర్వానికి అన్నీ పార్టీలు తెర తీస్తునట్టుగా తెలుస్తుంది .

ఎక్కడికక్కడ ఓటర్లును ఆకట్టుకోవడానికి భారీ ఎత్తున తాయిలాల పందేరానికి అభ్యర్థులు రెఢీ అయ్యారు .ఓటర్లను డబ్బు మద్యం బహుమతులుతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.ఈసారి రికార్డు స్థాయిలో దన ప్రవాహం ఎన్నికల్లో ప్రవహించబోతున్నట్లుగా కూడా అనధికారికంగా రికార్డులు వస్తున్నాయి .గెలుపుకి ఓటమికి మధ్య ఇంకా 24 గంటలు మాత్రమే సమయం ఉండటంతో విజయలక్ష్మి ని వరించడానికి అభ్యర్థులు దేనికైనా సరే రెడీ అన్నట్లుగా ముందుకు వెళ్తుండటం గమనార్హం.ఈసారి ఎన్నడూ లేని విధంగా వామపక్ష అభ్యర్థులు కూడా డబ్బులు పంచుతున్నారని వార్తలు వస్తుండటం శోచనీయం.మరి ఇన్ని ప్రలోభాల మధ్య ప్రజాస్వామ్యం ఎలా బ్రతికి బట్ట కడుతుందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు
.