ఈ స్మార్ట్ గ్లాసెస్ పెట్టుకుంటే లైవ్ స్ట్రీమింగ్ వీడియోలు చూడొచ్చు

టెక్నాలజీ( Technology ) ఎప్పటికప్పుడు మారుతోంది.మార్కెట్‌లోకి కొత్త కొత్త గ్యాడ్జెట్లు వస్తున్నాయి.

 If You Wear These Smart Glasses, You Can Watch Live Streaming Videos, Smart Clas-TeluguStop.com

ఇదే క్రమంలో ఇటీవల మెటా కంపెనీకి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది.మెటా గత కొన్ని నెలలుగా సన్ గ్లాసెస్ దిగ్గజం రే-బాన్ ( Ray-Ban )సహకారంతో దాని రెండవ తరం స్మార్ట్ గ్లాసెస్‌పై పని చేస్తోంది.

ఈ రాబోయే స్మార్ట్ గ్లాస్‌కు సంబంధించి ఇప్పటివరకు చాలా నివేదికలు వచ్చాయి.స్మార్ట్ గ్లాసెస్‌కు సంబంధించి ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి టెక్ మార్కెట్‌లో కొత్త చర్చ మొదలైంది.

బయటకు వచ్చిన తాజా నివేదిక ప్రకారం, మెటా ఈ స్మార్ట్‌గ్లాస్ అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంటుంది.అయితే, ఈ నివేదికలో ఈ స్మార్ట్‌గ్లాస్ ధర( smartglass ) గురించి ఎటువంటి సమాచారం లేదు.

మెటా 2021లో ఫస్ట్ జనరేషన్ మెటా రే-బాన్ స్టోరీస్ స్మార్ట్ గ్లాస్‌ను ప్రారంభించింది.ఈ స్మార్ట్ గ్లాసెస్‌ లైవ్ వీడియో ఫంక్షన్‌ను కలిగి ఉంటాయి.

ఈ ఫీచర్ ద్వారా, వినియోగదారులు ఎప్పుడైనా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయగలరు.గ్లాసుల నుండి నేరుగా ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల, వినియోగదారులు స్ట్రీమర్‌కు సమానమైన అనుభూతి పొందుతారు.

Telugu Latest, Love, Smart Class, Ups-Latest News - Telugu

ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో మైక్రోఫోన్, స్పీకర్ కూడా ఉంటాయి.దీని ద్వారా లైవ్ స్ట్రీమ్‌ల సమయంలో క్రియేటర్లు తమ యూజర్లు లేదా ఫాలోవర్లతో కమ్యూనికేట్ చేయగలుగుతారు.ఇది కాకుండా, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఈ స్మార్ట్ గ్లాస్‌లో ఉంది.ఈ అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ గ్లాసెస్ సెన్సార్ల నుండి శక్తివంతమైన బ్యాటరీల వరకు సరికొత్త సాంకేతికతను కలిగి ఉండనుంది.

ఈ గ్లాసెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.మెటా మొదటి తరం స్మార్ట్ గ్లాసెస్ ధర చాలా భారీగా ఉంటుంది.ఇది శక్తివంతమైన బ్యాటరీ కోసం ఎల్ఈడీను( LED ) కలిగి ఉంది.ఈ గ్లాస్ ఫోన్ కాల్‌లను సపోర్ట్ చేస్తుంది.

కానీ దాని ధర చాలా ప్రీమియం రేంజ్‌లో ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.రెండవ తరం స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ గురించి మెటా ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

కానీ ఇప్పటివరకు మీడియా నివేదికల ప్రకారం, ఈ స్మార్ట్ గ్లాస్ అక్టోబర్ 2023లో మాత్రమే ప్రారంభించనున్బనారు.అక్టోబర్‌లో విడుదల కానున్న క్వెస్ట్ 3 మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్‌తో పాటు ఈ స్మార్ట్ గ్లాస్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ సెకండ్ జనరేషన్ స్మార్ట్ గ్లాస్ ధర కూడా ప్రీమియం విభాగంలో ఉండే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube