ఈ విధంగా వాకింగ్ చేస్తే సూప‌ర్ ఫాస్ట్‌గా బ‌రువు త‌గ్గుతారు..తెలుసా?

వాకింగ్‌.సుల‌భ‌మైన, తేలికైన‌ మ‌రియు అద్భుత‌మైన వ్యాయామం ఇది.

రెగ్యుల‌ర్‌గా ఓ గంట పాటు వాకింగ్ చేస్తే ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుందని నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతూనే ఉంటారు.

అందుకే చాలా మంది వాకింగ్‌ను త‌మ డైలీ రొటీన్‌లో చేర్చుకుంటారు.

అందులోనూ ముఖ్యంగా బ‌రువు తగ్గ‌డం కోసం వాకింగ్ చేసే వారు ఎంద‌రో ఉంటారు.అయితే వెయిట్ లాస్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నించే వారు.నార్మ‌ల్ వాక్ కాకుండా ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా వాకింగ్ చేస్తే సూప‌ర్ ఫాస్ట్‌గా బ‌రువు త‌గ్గొచ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.వాకింగ్ చేసేట‌ప్పుడు క్యాజువల్ గా నడవడం కాకుండా కొంత బ‌రువును ఎత్తుకుని న‌డ‌వండి.

Advertisement
If You Walk Like This, You Will Lose Weight Super Fast , Lose Weight, Walk, Walk

అంటే ఏదైనా బ‌రువున్న‌ వ‌స్తువును రెండు చేతుల‌తో ప‌ట్టుకుని వాకింగ్ చేయండి.ఇలా చేయ‌డం వ‌ల్ల కండ‌రాలపై ఒత్తిడి పెరిగి శ‌రీరంలో కేల‌రీలు త్వ‌ర‌గా క‌రుగుతాయి.

దాంతో వేగంగా బ‌రువు త‌గ్గుతారు.అలాగే వెయిట్ లాస్ అవ్వాల‌ని భావించే వారికి బ్రిస్క్ వాకింగ్ చాలా హెల్ప్ చేస్తుంది.

స్పీడ్ గా నడవడాన్ని బ్రిస్క్ వాకింగ్ అని అంటారు.ఇది రన్నింగ్‌ చేసినంతటి ఫలితాన్ని అందిస్తుంది.

రెగ్యుల‌ర్ ఓ ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేస్తే త్వరగా బరువు తగ్గుతారని కొన్ని పరిశోధనల ద్వారా తేలింది.అలాగే గుండె జ‌బ్బులు, మ‌ధుమేహం వంటి వ్యాధులు వ‌చ్చే ప్ర‌మాదం సైతం త‌గ్గుతుంది.

If You Walk Like This, You Will Lose Weight Super Fast , Lose Weight, Walk, Walk
తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

అప్‌హిల్ క్లైంబ్‌.అంటే ఎత్తైన ప్రాంతాలకు వాకింగ్ చేయడం.తొంద‌ర‌గా వెయిట్ లాస్ అవ్వాల‌నుకునే వారు ఎత్తైన ప్రాంతాలకు వాకింగ్ చేస్తే చాలా మంచి ఫ‌లితం ఉంటుంది.

Advertisement

అలాగే అప్‌హీల్ క్లైంబ్ వ‌ల్ల ఒత్తిడి దూరం అవుతుంది.మాన‌సిక ఎదుగుల ఇంఫ్రూవ్ అవుతుంది.కండ‌రాలు దృఢంగా కూడా మార‌తాయి.

తాజా వార్తలు