వేసవికాలం వచ్చిందంటే ఇంట్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ( ACs, coolers, fans )నిరంతరం ఆన్ లో ఉండాల్సిందే.కాసేపు కరెంట్ లేకపోతే ఉక్కపోత భరించడం కష్టమే.
ఇక నిరంతరం ఏసీలు ఆన్ లో ఉంటే కరెంట్ బిల్లు ఎంత వస్తుందో చెప్పలేం.సాధారణంగా వచ్చే కరెంట్ బిల్లు కంటే మూడింతలు, నాలుగింతలు రెట్టింపు వచ్చిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.
అయితే వేసవి కాలంలో ఏసీ వాడినా కూడా కరెంట్ బిల్లు తక్కువగా రావాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవాలో నిపుణులు చెబుతున్నారు.ఆ టిప్స్ పాటిస్తే.
కరెంట్ బిల్లు దాదాపుగా సగం తగ్గించుకోవచ్చు.
ఇంట్లో వాడే ఏసీ ని 24 డిగ్రీల ఉష్ణోగ్రతకు అమర్చాలి.
ఇది మానవ శరీరానికి చాలా అనువైనదిగా ఉంటుంది.ఏసీలో సెట్ చేసే ఉష్ణోగ్రత కూడా విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది.
ఉష్ణోగ్రతను ఒక యూనిట్ తగ్గించిన విద్యుత్ వినియోగం ఆరు శాతం పెరుగుతుంది.కాబట్టి గదిని సిమ్లాగా మార్చడం కంటే ఏసీ ని 20 నుంచి 24 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య ఆ మార్చడం మంచిది.
విండో ఏసి, స్ప్లిట్ ఏసీ, మెషిన్ కండెన్సర్( Window AC, Split AC, Machine Condenser ) లను బయట విండో లేదా గోడపై అమరుస్తారు.అయితే ఇంటి లోపల ఉండే దుమ్ము వల్ల అందులో ఉండే ఫిల్టర్లు మూసుకుపోతాయి.దీంతో ఏసీల పనితీరు తగ్గుతుంది.అప్పుడు విద్యుత్ వినియోగం పెరుగుతుంది.కాబట్టి ఏసీ ఫిల్టర్ లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, ప్రతి సీజన్లో కనీసం ఒక్కసారైనా సాధారణ సర్వీసింగ్ చేయడం వల్ల ఏసీ సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చు.
గదిలో గాలి ప్రసరణ మెరుగుగా ఉండాలంటే.ఏసి వేశాక సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేయాలి.దీంతో చల్లటి గాలి గది అంతా వ్యాపిస్తుంది.
ఇక ఈ గాలి బయటకు వెళ్లకుండా తలుపులు, కిటికీలు మూసేయాలి.ఒకవేళ తలుపులు కిటికీలు తెలిసి ఉంటే విద్యుత్ వినియోగం పెరుగుతుంది తప్ప గది చల్లబడదు.
ముఖ్యమైన ట్రిక్ ఏమిటంటే.ఏసీలో టైమర్ ఫంక్షన్ ఉపయోగించాలి.
అంటే గది చల్లబడిన రెండు గంటల తర్వాత ఆటోమేటిక్ గా ఏసీ ఆఫ్ అయ్యేలా టైమర్ సెట్ చేయాలి.టైమర్ ఉపయోగించడం వల్ల ఏసీ విడిభాగాలపై ఒత్తిడి తగ్గుతుంది.
దీంతో చాలావరకు విద్యుత్ ఆదా అవుతుంది.