భారతీయులంతా అన్ని రకాల వంటకాలను వంటగదిలో తయారు చేస్తారు.అది పండుగల సమయంలో లేదా ఏదైనా వివాహ వేడుకలో అయినా స్వయంగా వండుకోవాలని భావిస్తారు.
ముఖ్యంగా ఇంట్లో పార్టీల సమయంలో చాలా రుచికరమైన వంటకాలు కూడా తయారు చేస్తారు.అయితే బయటకు వెళ్లాల్సిన తరుణంలో ఏదైనా హోటల్‌లో ఫుడ్ తిని సరిపెట్టుకుంటారు.
ముఖ్యంగా విహార యాత్రలకు వెళ్లే సందర్భాల్లో అక్కడ వండుకోవడానికి వీలు పడదు.దీంతో ఏదైనా పార్సిల్ పట్టుకెళ్లడమో లేదా హోటల్‌లకు వెళ్లి తినడమో చేస్తుంటారు.
అదే ఇంట్లో ఉంటే చక్కగా మనకు నచ్చింది వండుకుని తినే సౌలభ్యం ఉండేదని భావిస్తారు.

బాగా రుచికరమైన వంటకాలు తిరిగి మరోసారి వేడి చేసుకుని తినడానికి మైక్రో ఓవెన్ వినియోగిస్తారు.అయితే మైక్రో ఓవెన్‌ని( microwave oven ) ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లడానికి వీలుండదు.ఇప్పుడు ఆ సమస్య లేదు.
చక్కగా టెక్నాలజీ మరింత వృద్ధి చెందుతున్న తరుణంలో జపనీయులు సరికొత్త మైక్రో ఓవెన్‌ను తయారు చేశారు.దానిని చూస్తే మైక్రో ఓవెన్ అని అస్సలు అనుకోరు.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.మనం అంతా పోర్టబుల్ స్టవ్, పోర్టబుల్ కుకర్( Portable Stove, Portable Cooker ) వంటివి వినియోగిస్తుంటాం.
అయితే పోర్టబుల్ మైక్రో ఓవెన్ అనేది ఇప్పటి వరకు మనం విని ఉండం.

అయితే టెక్నాలజీలో ఎంతో ముందుండే జపనీయులు ప్రస్తుతం దానిని కూడా సుసాధ్యం చేశారు.ఎక్కడికైనా తీసుకెళ్లగలిగేలా సరికొత్త మైక్రో ఓవెన్‌ను తయారు చేశారు.అచ్చం సూట్‌కేస్‌లా ఉండే దీనిని మనం అవసరమైన సందర్భంలో ఓపెన్ చేసుకోవచ్చు.
మనకు కావాల్సిన ఆహారాన్ని అందులో పెట్టుకుని వేడి చేసుకోవచ్చు.మన పని పూర్తైన తర్వాత తిరిగి సూట్ కేస్‌లా దానిని మడిచేయొచ్చు.
హ్యాండిల్ లాక్ ఓపెన్ చేసేందుకు దానిని వెనక్కి జరపాలి.మన పని పూర్తైతే తిరిగి ఫోల్డ్ చేసేయొచ్చు.
చూడడానికి ఎంతో బాగున్న ఈ మైక్రో ఓవెన్ ఇంకా మార్కెట్‌లోకి విడుదల కాలేదు.దీనికి సంబంధించిన చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.