టీ బీజేపీ(TBJP) .ఇందులో కొంతమంది కీలక నాయకులు తప్ప మిగతా వారు ఎవరికి ఎక్కడా కూడా క్యాడర్ లేదు.
ఒకానొక దశలో కేసీఆర్ కి కొరకరాని కొయ్యగా ఉన్న టీబీజేపీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారింది.టీబీజేపీలో బండి సంజయ్,(Bandi Sanjay) ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, కిషన్ రెడ్డి వంటి వారు తప్ప అంతగా ఫేమస్ అయిన రాజకీయ నాయకులు లేరు.
ఇక కాంగ్రెస్ ప్రతిసారి బిజెపి బీఆర్ఎస్ ఒక్కటేనని ఎక్కడ బహిరంగ సభ పెట్టినా అక్కడ చెప్పుకుంటూ వస్తుంది.అయితే చాలామందికి బీఆర్ఎస్ బిజెపి ఒక్కటేనని భావిస్తూ ఉంటారు.
మరీ ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపి రెండు నేషనల్ పార్టీస్ కాబట్టి కాంగ్రెస్ కి బిజెపి బిజెపికి కాంగ్రెస్ అస్సలు సపోర్ట్ చేయవు.
ఒకవేళ బీఆర్ఎస్ (BRS) రాష్ట్రంలో ఫామ్ అయి కొద్ది సీట్లు వస్తే రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ చేతిలో ఉంటుంది అని తెలిస్తే ఖచ్చితంగా బిజెపి బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తుంది.
అంతేకానీ కాంగ్రెస్ కు అస్సలు సపోర్ట్ చేయదు.ఇక ఇప్పటికే బీఆర్ఎస్ కి ఎంఐఎం( MIM ) సీట్లు ఎలాగూ వస్తాయి.ఇక బిజెపి తరఫున గెలిచిన కొంతమంది కూడా బీఆర్ఎస్ రాష్ట్రంలో ఫామ్ అవుతుంది అంటే కచ్చితంగా బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతారు.ఒకవేళ ఎన్నికల తర్వాత ఇది జరిగితే ఖచ్చితంగా టీబీజేపీ రెండు వర్గాలుగా చీలిపోతుంది అంటూ కొంతమంది రాజకీయ నాయకులు భావిస్తున్నారు.

దానికి ప్రధాన కారణం కెసిఆర్( KCR ) అంటే బిజెపిలో ఉన్న కొంతమంది నాయకులకు అస్సలు పడదు.కేసీఆర్ నీ అధికారం నుండి గద్దె దించడం కోసమే కొంతమంది బిజెపి పార్టీ బలంగా ఉందని అందులోకి వెళ్లారు.కానీ ఆ తర్వాత బిఆర్ఎస్ బిజెపి ఒక్కటేనని ఆ పార్టీని వదిలి కాంగ్రెస్ లోకి వచ్చారు.అలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,( Komatireddy Raj Gopal Reddy ) విజయశాంతి(Vijayashanthi) వంటి నేతలు బిజెపిలోకి వెళ్లి మళ్లీ కాంగ్రెస్ కు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఇక టీబీజేపీ కేవలం ఓట్లను చీల్చడం కోసం మాత్రమే ఈసారి ఎన్నికల్లో నిలుస్తుంది అని చాలామంది భావిస్తున్నారు.

ఎందుకంటే రాష్ట్రం అంతటా బిజెపికి క్యాడర్ లేదు.కానీ ప్రతి నియోజకవర్గంలో పోటీ ఇస్తూ కొద్ది వరకు ఓట్లు చీల్చడం తప్ప బలమైన క్యాడర్ మాత్రం అస్సలు లేదు.ఈ లెక్కన బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల తర్వాత బిజెపి (BJP) సపోర్ట్ చేస్తే మాత్రం బిజెపిలో ఉన్న కొంతమంది బీఆర్ఎస్ కి అస్సలు సపోర్ట్ చేయరు.
ఈ కారణంతో టీబీజేపీ ఎన్నికల తర్వాత రెండు వర్గాలుగా చీలిపోతుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.







