నేడు నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతున్నవరల్డ్ కప్ ( World Cup) ఫైనల్ మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.సెమీ ఫైనల్స్‌లో నెగ్గిన భారత్, ఆస్ట్రేలియా నేడు జరిగే ఫైనల్స్‌లో తలపడనున్నాయి.
ఈ నేపథ్యంలో ఇండియన్ సెలబ్రిటీలు ఇండియా గెలుపును కోరుకుంటున్నారు.ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు తప్పకుండా ఇండియానే కప్పు గెలుస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోని నటుడు విక్టరీ వెంకటేష్ ( Venkatesh ) సైతం వరల్డ్ కప్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ మ్యాచ్ చూడటం కోసం వెంకటేష్ అహ్మదాబాద్ చేరుకున్నారు.

ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ఈసారి వరల్డ్ కప్ తప్పకుండా మనకే వస్తుందని వెంకటేష్ జోస్యం చెప్పారు.కోహ్లీ 50వ సెంచరీ పూర్తి చేసి సచిన్ ( Sachin ) రికార్డును బ్రేక్ చేసినప్పుడు తాను స్టేడియంలోనే ఉన్నాను.ఆ క్షణాలను చూడటం తనకు చాలా సంతోషంగా అనిపించిందని వెంకటేష్ తెలిపారు.ఇక షమీ( Mohammed Shami ) ఆట తీరుపై కూడా ఈయన ప్రశంసలు కురిపించారు.
ఇక సెలబ్రెటీ క్రికెట్ లీగ్ ప్రారంభమైనప్పుడు వెంకటేష్ కూడా పాల్గొంటారు అనే విషయం మనకు తెలిసిందే.ఇలా క్రికెట్ అంటే ఎంతో ఇష్టం ఉన్నటువంటి ఈయనకు విలేకరి నుంచి ఒక ప్రశ్న ఎదురైంది.
మీకు కనుక క్రికెటర్ బయోపిక్ లో నటించాల్సి వస్తే ఎవరి బయోపిక్( Biopic ) లో నటిస్తారు అంటూ ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ తాను ఎవరి బయోపిక్ చిత్రంలో నటించాలనుకోవడం లేదని తనకు అలాంటి ఆలోచన కూడా లేదని తెలిపారు.తాను కేవలం క్రికెట్( Cricket ) చూస్తే చాలు అంటూ ఈయన చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.వరల్డ్ కప్‌లో ఇండియన్ టీమ్ పెట్టిన ఎఫర్ట్‌ను వెంకటేష్ అభినందించారు.
వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే సినీ సెలబ్రిటీలు అందరూ కూడా అహ్మదాబాద్ చేరుకున్నారు.







