Chiranjeevi Pawan Kalyan : 'మెగా బ్రదర్స్ 'ను బుట్టలో వేసుకుంటే... ? బీజేపీ కొత్త ఎత్తులు ?

ఏపీ రాజకీయాలపై పూర్తిగా దృష్టి సాధించింది కేంద్ర అధికార పార్టీ బిజెపి.

ఏపీలో బిజెపి ఎప్పటి నుంచో బలపడాలని చూస్తున్నా, అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడున్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

ఏపీ అధికార పార్టీగా ఉన్న వైసిపి తో మొన్నటివరకు సఖ్యత గానే ఉన్నా,  ఇప్పుడు వైరం ప్రదర్శిస్తోంది.అలాగే ప్రధాన ప్రతిపక్షం టిడిపిని మరింత బలహీనం చేసి రాబోయే రోజుల్లో టిడిపి స్థానాన్ని జనసేన సహకారంతో ఆక్రమించాలని బిజెపి ఎత్తులు వేస్తోంది.2024 ఎన్నికల్లో బిజెపి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినా, 2029 లో మాత్రం కచ్చితంగా అవకాశం ఉంటుందని అది సాధ్యం అవ్వాలంటే టిడిపిని బలహీనం చేయాలని ప్రయత్నాలు చేస్తోంది.దీనిలో భాగంగానే క్రమ క్రమంగా ఏపీలో తమపట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మాస్ ఫాలోయింగ్ ఉన్న మెగా బ్రదర్స్ ను బిజెపి టార్గెట్ చేసుకుంది.ఇప్పటికే ఏపీలో బిజెపి జనసేనతో పొత్తు పెట్టుకుంది .2024 ఎన్నికల్లో తమ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఇప్పటికే బీజేపీ ప్రకటించింది.టిడిపికి దగ్గర అయ్యేందుకు పవన్ ప్రయత్నించినా,  ప్రధాని నరేంద్ర మోది విశాఖలో పవన్ తో భేటీ అయ్యారు.

ఆ తరువాత ఆయన ఆలోచనలో కూడా మార్పు వచ్చింది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ, సినిమాల పైన దృష్టి సారించిన మెగాస్టార్ చిరంజీవిని తమ వైపుకు తిప్పుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బిజెపికి కలిసి వస్తుందని,  లక్షల్లో ఉన్న మెగా అభిమానులు బిజెపికి అండగా నిలబడతారనే వ్యూహానికి బిజెపి తెరతీసింది. 

Advertisement

ఈ మేరకు బిజెపికి మెగాస్టార్ చిరంజీవి అండగా ఉండే విధంగా ఆ పార్టీ అగ్ర నాయకులు పావులు కలుపుతున్నట్లు సమాచారం.ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ ఉన్నత స్థానంలో ఉంటారంటూ ఇటీవల చిరంజీవి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే బిజెపికి చిరంజీవి దగ్గర అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.అదే జరిగితే మెగా బ్రదర్స్ ఇద్దరి అభిమానుల మద్దతుతో తెలంగాణతో పాటు ఏపీలోనూ బిజెపి రాజకీయంగా లబ్ధి పొందుతుంది అనడంలో సందేహం లేదు.

 .

Advertisement

తాజా వార్తలు