సోషల్ మీడియా లో ఆ విధంగా పోస్ట్ లు పెట్టారో ఇక అంతే ..? 

ఏపీలో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది.రౌండ్ల వారిగా ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి.

తుది ఫలితాలు విడుదల అయ్యేందుకు మరి కొంత సమయం ఉంది.

రౌండ్ల భారీగా విడుదలవుతున్న ఫలితాలు అభ్యర్థుల తో పాటు,  ఆయా పార్టీల నేతలకు ఉత్కంఠ కలిగిస్తున్నాయి.

ఏపీలో అధికార పీఠం ఎవరికి దక్కుతుంది ? ఎవరు ప్రతిపక్షంలో కూర్చుంటాను అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.రాజకీయ పార్టీల నేతలతో పాటు , సామాన్య జనాలు కౌంటింగ్ ప్రక్రియ ను, రౌండ్ల వారీగా వెలువడుతున్న ఫలితాలను టీవీల ముందు కూర్చుని ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఇక ఏపీలో కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టమైన బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు .దీని కోసం 67 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు.మొత్తంగా 5600 మంది కేంద్ర బలగాలతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

Advertisement
If You Post Like That On Social Media, That's All, Ap Elections, CBN, Chandraba

కొద్దిరోజుల క్రితం పల్నాడు , అనంతపురం,  చిత్తూరు జిల్లాలో హింసాత్క ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో,  భారీగా కేంద్ర బలగాలను మోహరించారు .

If You Post Like That On Social Media, Thats All, Ap Elections, Cbn, Chandraba

కౌంటింగ్ కేంద్రాల వద్ద ఐదు అంచల భద్రతను ఏర్పాటు చేశారు.డ్రోన్లతో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు.కౌంటింగ్ నేపథ్యంలో 4 5 తేదీలలో విజయోత్సవాలకు,  ర్యాలీలకు అనుమతిని రద్దు చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

  ఎవరైనా అల్లర్లకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేసేందుకు కూడా వెనకడమని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.కౌంటింగ్ కేంద్రాల్లో ప్రతి బ్లాక్ కు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్( Special Protection Force ) తో పాటు,  తొమ్మిది టిఆర్ గ్యాస్ టీమ్ లు రంగంలోకి దిగాయి.  రెండు టియర్ గ్యాస్ వాహనాలను అందుబాటులో ఉంచారు .అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక ఫోర్స్ లు అందుబాటులో ఉంచారు.

If You Post Like That On Social Media, Thats All, Ap Elections, Cbn, Chandraba
పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

కౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియా( Social media ) పైన ప్రత్యేకంగా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.రెచ్చగొట్టే పోస్టులు , వ్యాఖ్యలపై సీరియస్ గా దృష్టిపెట్టారు ఏపీ డీజీపీ.నిబంధనలకు విరుద్ధంగా రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఐ టి యాక్ట్ కింద కేసులు,  రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని,  పిడి యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు.

Advertisement

రెచ్చగొట్టే పోస్టులను ఫోటోలను వీడియోలను వాట్సప్ స్టేటస్ గా పెట్టుకోవడం, షేర్ చేయడాన్ని నిషేధించారు.

తాజా వార్తలు