మిల్క్ షేక్ ఆర్డర్ చేస్తే.. వేడివేడి "మూత్రం" డెలివర్ చేసిన బాయ్..!

ఈ రోజుల్లో ఫుడ్‌ డెలివరీ యాప్స్‌లో మీల్స్ ఆర్డర్ చేయడం కామన్ అయిపోయింది.

ఆన్‌లైన్‌లో చిటికెలో ఆర్డర్ చేసి నిమిషాల వ్యవధిలో ఇంటికి ఫుడ్ తెప్పించుకోనే ఫెసిలిటీ గ్రామాలకు కూడా ఇప్పుడు పాకింది.

అయితే ఈ ఫుడ్ చల్లారిపోవడం, పాచిపోవడం వంటి సమస్యలను కస్టమర్లు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యలన్నిటి వల్ల చాలామంది ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఆలోచిస్తున్నారు.

కొందరు మాత్రం వాటి మీదనే ఆధారపడుతున్నారు.ఇలాంటి వారికి రెస్టారెంట్స్ మాత్రమే కాదు ఒక్కోసారి డెలివరీ బాయ్స్ కూడా షాక్‌లు ఇస్తున్నారు.

తాజాగా ఒక డెలివరీ బాయ్( Delivery boy ) కస్టమర్‌కి ఊహించని షాక్ ఇచ్చాడు.అతడు మిల్క్ షేక్ కప్పులో మూత్రం పోసి కస్టమర్‌కి డెలివరీ చేశాడు.

Advertisement

ఈ సంగతి తెలియని సదరు వినియోగదారుడు దాన్ని కొంచెం తాగాడు.అప్పుడే అది మూత్రం అని తెలిసి కంగుతిన్నాడు.

వివరాల్లోకి వెళితే, కాలేబ్ వుడ్ అనే అమెరికాకు చెందిన వ్యక్తి ఇటీవల ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ గ్రుభబ్ ( Grubhub ) నుంచి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు.అతను చిక్-ఫిల్-A ( Chick-fil-A )నుంచి ఫ్రైస్, మిల్క్ షేక్ ఆర్డర్ చేశాడు, కానీ బదులుగా అతనికి ఒక కప్పు మూత్రం వచ్చింది.అది తెలియని కాలేబ్ మిల్క్ షేక్ తాగుదామని కప్పులో స్ట్రా వేసి ఒక సిప్ తాగాడు.

రుచి చూసినప్పుడు తేడా గ్రహించాడు.అది యూరిన్ అని అర్థం చేసుకున్నాడు.

వెంటనే డెలివరీ డ్రైవర్‌ను పిలిచి నిలదీశాడు.దాంతో డెలివరీ బాయ్ అసలు నిజం కక్కేసాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

కప్పులో మూత్ర విసర్జన చేశానని, అనుకోకుండా అదే మీకు ఇచ్చానని కాలేబ్‌ ముందు ఒప్పుకున్నాడు.లాంగ్ షిఫ్టుల కారణంగా రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించడానికి సమయం లేదని, అందుకే మిల్క్ షేక్ కప్పులో ఆ పని కానిచ్చేశానని, దాన్ని పడేయకుండా మర్చిపోయి డెలివరీ చేశానని చావు కబురు చల్లగా చెప్పాడు.

Advertisement

మూత్రం తాగిన తర్వాత కాలేబ్ అస్వస్థతకు గురయ్యాడు, ఫిర్యాదు చేయడానికి గ్రుభబ్‌ను సంప్రదించాడు.అయితే, కంపెనీ రెస్పాండ్ అవ్వడానికి నాలుగు రోజులు పట్టింది.డెలివరీ, లేదా టిప్ లేకుండా అతని ఆర్డర్ ధర 18 డాలర్ల (రూ.1,499)ను మాత్రమే కంపెనీ రిఫండ్ చేసింది.ఈ తీరు సోషల్ మీడియాలో పెద్ద విమర్శలకు దారి తీసింది.

ఈ ఘటనపై నెటిజన్లు తమ అసహ్యం, అవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు.కొంతమంది వినియోగదారులు కాలేబ్ అబద్ధం చెప్పారని ఆరోపించారు, మరికొందరు అతని దురదృష్టంపై జోకులు వేశారు.

మరోవైపు గ్రుభబ్ సంస్థ ఈ సంఘటనకు క్షమాపణలు చెప్పింది.డ్రైవర్‌ను తొలగించామని, కస్టమర్ సర్వీస్ ప్రతినిధికి ట్రైనింగ్ ఇచ్చామని తెలిపింది.

విషయాలను సరిదిద్దడానికి కాలేబ్‌తో మాట్లాడుతున్నట్లు పేర్కొంది.

తాజా వార్తలు