'లియో' సక్సెస్ మీట్ లో రజినీకాంత్ పై సెటైర్ల వర్షం కురిపించిన హీరో 'విజయ్'.

సోషల్ మీడియా లో ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఫ్యాన్ వార్స్ జరగడం అనేది చాలా సర్వసాధారణం, కానీ ఇద్దరి హీరోల మధ్య గొడవలు జరగడం, సెటైర్లు వేసుకోవడం అనేది చాలా అరుదుగా మనం చూస్తుంటాము.తమిళనాడు రీసెంట్ గా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది.

 Hero 'vijay' Showered Satires On Rajinikanth In 'leo' Success Meet , Rajinikanth-TeluguStop.com

‘జైలర్’ ( jailer )మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్, తన తోటి స్టార్ హీరో విజయ్ మీద పరోక్షంగా కొన్ని సెటైర్లు వదులుతాడు.విజయ్( Vijay ) నటించిన బీస్ట్ చిత్రం మీద అయితే నేరుగానే కౌంటర్లు వేస్తాడు.‘బీస్ట్’ టేకింగ్ మొత్తం బాగానే ఉంటుంది, కానీ తారాగణం సరిగా లేదు, అందుకే ఆ చిత్రం ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయింది అని అంటాడు.అదే ఈవెంట్ లో విజయ్ ని ఉద్దేశిస్తూ పరోక్షంగా కొన్ని కామెంట్స్ చేస్తాడు.

ప్రస్తుతం తమిళనాడు లో విజయ్ ఉన్నంత టాప్ ఫామ్ లో ఏ హీరో కూడా లేడు.

Telugu Vijayshowered, Jailer, Kollywood, Rajinikanth, Tamil Nadu, Vijay-Movie

ఆయన సినిమాలకు నెగటివ్ టాక్ వచ్చినా కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ రేంజ్ కి వెళ్లిపోతున్నాయి.ఆ స్థాయి క్రేజ్ ఉంది ప్రస్తుతం అతనికి.రీసెంట్ గా విడుదలైన ‘లియో’ ( Leo )చిత్రానికి ఏ రేంజ్ డివైడ్ టాక్ వచ్చిందో మనమంతా చూస్తూనే ఉన్నాం.

ఈ సినిమాకి 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయంటే అందుకు కారణం విజయ్ స్టార్ డమ్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అయితే రజినీకాంత్( Rajinikanth ) జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ‘ కాకి గాల్లోకి ఎగరగానే ఈ ప్రపంచం మొత్తం తనదే అని అనుకుంటుంది.

కానీ ఆ ఆకాశం లో నేను గ్రద్ద లాంటోడిని, నన్ను కాకులు ఏమి చెయ్యలేవు’ అంటూ విజయ్ ని ఉద్దేశిస్తూ పరోక్షంగా సెటైర్లు విసిరుతాడు.ఇక నిన్న జరిగిన లియో సక్సెస్ మీట్ లో విజయ్ దీనికి కౌంటర్ ఇస్తాడు.

Telugu Vijayshowered, Jailer, Kollywood, Rajinikanth, Tamil Nadu, Vijay-Movie

ఆయన మాట్లాడుతూ ‘ ఒక అడవిలో చాలా క్రూరమైన జంతువులూ ఉన్నాయి.అదే అడివిలో ఒక కాకి మరియు ఒక గ్రద్ద కూడా ఉంటాయి’ అని అంటాడు.ఈ మాట అనగానే ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోతాది.ఎందుకంటే విజయ్ కౌంటర్ ఇస్తుంది రజినీకాంత్ కి అని అందరికీ అర్థం అయిపోయింది.ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఎంత పెద్ద గ్రద్ద అయినా, కాకి అయినా నేల మీదకి రావాల్సిందే.నేను నేల లాంటి వాడిని, ఎప్పుడూ తటస్తంగానే ఉంటాను’ అంటూ విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

మరి దీనికి రజినీకాంత్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube