మహా శివరాత్రి రోజు మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేస్తే..!

త్రిమూర్తులలో ఒకరైన పరమశివుడికి మహాశివరాత్రి రోజున భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.అదే విధంగా శివరాత్రి రోజు జాగరణ చేస్తూ శివనామస్మరణ చేసుకుంటారు.

ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడికి తప్పకుండా రుద్రాక్ష ధారణ.మారేడు దళాలను సమర్పించడం మర్చిపోకూడదు.

If You Go Around The Tree To Change On The Day Of Maha Shivaratri, Maha Sivaratr

ఆ పరమశివుడికి ఎంతో ఇష్టమైన వాటిలో రుద్రాక్షలు కూడా ఒకటి.ఎంతో కఠినమైన తపస్సు చేస్తున్న ఆ పరమేశ్వరుని కంటి నుంచి జాలువారిన కన్నీటి బిందువులే రుద్రాక్షలుగా భావిస్తారు.

ఎంతో పవిత్రమైన ఈ రుద్రాక్ష చెట్టు నేపాల్ ఖాట్మండ్ పశుపతినాథ దేవాలయంలో వుంది.అవి ఏకముఖి నుంచి దశముఖి వరకు ఉంటాయి.

Advertisement

వీటిలో ఆరు ముఖాలున్న రుద్రాక్షలు కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపం అని భావిస్తారు.అదేవిధంగా మహాశివరాత్రి రోజున పరమశివుడికి మారేడు దళాన్ని సమర్పించడం మర్చిపోకూడదు.

ముఖ్యంగా మారేడు దళములతో పూజ చేసే సమయంలో కాడ తీసేయకుండా పూజ చేయడం మరిచిపోకూడదు.శివరాత్రి రోజున మారేడు దళాలతో పూజ చేసే వారికి సకల సంపదలు ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడని భావిస్తారు.

అదేవిధంగా మహాశివరాత్రి రోజు మారేడు చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల ముక్కోటి దేవతలకు ప్రదక్షణాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది.అదేవిధంగా మన మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి.1.తప్పకుండా భస్మ ధారణ చేయాలి.2.రుద్రాక్షలను మెడలో వేసు కోవడం.3.మారేడు దళాలతో శివలింగార్చన చేయడం.ఈ మూడు విషయాలను ప్రతి వ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

ఈ విధంగా మహా శివరాత్రి రోజు ఆ పరమశివుని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉండి సకల సంపదలను, అష్టైశ్వర్యాలను కల్పిస్తాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు