ఈ చిట్కాలు పాటిస్తే.. చిటికెలో కడుపునొప్పి మాయం..

ఈమధ్య కాలంలో బయట దొరికే ఆహారాన్ని తినడం వల్ల కడుపులో అనేక మార్పులు జరుగుతున్నాయి.

అయితే అజీర్తి, ఎసిడిటీ, స్పైసీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ లాంటివి తీసుకోవడం వలన చాలామంది కడుపునొప్పి బారిన పడుతున్నారు.

అదేవిధంగా సరైన సమయానికి భోజనం చేయకపోవడం, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం, అలాగే బయట ఉన్న కాలుష్యం ఇతర కారణాల వల్ల కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది.కడుపునొప్పికి కారణం ఏదైనా కానీ వెంటనే తగ్గించుకోవడం మంచిది.

అయితే కడుపు నొప్పి వచ్చినప్పుడు  తరచుగా చాలామంది వైద్యులను సంప్రదిస్తూ ఉంటారు.అయితే నేచురల్ చిట్కాల వల్ల కూడా కడుపునొప్పి తగ్గించుకోవచ్చు.

కడుపునొప్పి వచ్చినప్పుడు పుదీనా ఆకులు తింటే చాలా మంచిది.  వీటిని నీటిలో వేసి మరిగించి గోరువెచ్చగా అయ్యాక ఆ నీరు తాగితే కడుపునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Advertisement
If You Follow These Tips Stomach Ache Will Disappear In A Pinch , Dyspepsia, Ac

అదేవిధంగా వాముని బాగా నమిలి తినడం వలన కడుపునొప్పి తగ్గుతుంది.ఇక కడుపునొప్పినీ నివారించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా చాలా ఉపయోగపడుతుంది.

ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో ఆపిల్ సైడర్ వెనిగర్ ను వేసి మిక్స్ చేసి దాన్ని తాగాలి.దీనితో ఎంత తీవ్రమైన కడుపునొప్పి కూడా చిటికెలో మాయం అయిపోతుంది.

ఇక అదే విధంగా కడుపునొప్పి వచ్చినపుడు ఒక అరకప్పు పెరుగు తీసుకోవడం వలన చాలా సులువుగా కడుపునొప్పి తగ్గిపోతుంది.ఎందుకంటే పెరుగులో గుడ్ బ్యాక్టీరియా ఉండడం వలన ఇది కడుపునొప్పికి చాలా బాగా సహాయపడుతుంది.

ఇక అదే విధంగా నీళ్లలో ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే కడుపునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

If You Follow These Tips Stomach Ache Will Disappear In A Pinch , Dyspepsia, Ac
నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

అదేవిధంగా నీటిలో అల్లంని కూడా వేసి మరిగించి ఆ అల్లం నుంచి వచ్చిన ఆ నీటిని తాగడం వల్ల కడుపునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.ఎందుకంటే అందులో అల్లం లో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇది కడుపునొప్పి నుండి ఉపశమనం కలిగేందుకు సహాయపడతాయి.

Advertisement

తాజా వార్తలు