ఎంత ట్రై చేసినా నిద్ర ప‌ట్ట‌ట్లేదా? అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

నిద్ర‌.మ‌నకు, మ‌న‌ ఆరోగ్యానికి ఓ గొప్ప వ‌రం అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.

కంటి నిండా నిద్ర ఉంటే దాదాపు తొంబై శాతం జ‌బ్బులు ద‌రి చేర‌వ‌ట‌.కంటి నిండా నిద్ర ఉంటే శ‌రీర‌కంగానే కాదు మాన‌సికంగానూ బ‌లంగా, దృఢంగా ఉంటార‌ట‌.

అందుకే నిద్ర‌ను అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ద‌ని నిపుణులు త‌ర‌చూ చెబుతుంటారు.అయితే కొంద‌రికి రాత్రుళ్లు ఎంత ట్రై చేసినా నిద్ర ప‌ట్ట‌నే ప‌ట్ట‌దు.

దాంతో ఏం చేయాలో తెలియ‌క జుట్టు పీక్కుంటుంటారు.ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే డోంట్ వ‌ర్రీ.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే టీ ని తీసుకుంటే ప్ర‌శాంత‌మైన నిద్ర మీసొంతం అవుతుంది.

Advertisement

మ‌రి ఇంత‌కీ ఆ టీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో వ‌న్ టేబుల్ స్పూన్ సోంపు, ఆరు నుంచి ఏడు ఎండిన చామంతి పూలు, పావు స్పూన్ ఆర్గానిక్ ప‌సుపు, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసుకుని ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు బాగా మ‌రిగించాలి.

ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆఫ్ చేసి త‌యారు చేసిన టీని ఫిల్ట‌ర్ చేసుకోవాలి.ఈ టీలో వ‌న్ టేబుల్ స్పూన్ నెయ్యి, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె క‌లుపుకుని.రాత్రి నిద్రించ‌డానికి గంట ముందు సేవించాలి.

ఈ స్పెష‌ల్ టీని ప్ర‌తి రోజు గ‌నుక తీసుకుంటే చ‌క్క‌టి నిద్ర ప‌డుతుంది.నిద్ర‌లేమి స‌మ‌స్య ఉంటే ప‌రార్ అవుతుంది.

ఆరోగ్యంగా లేమని చెప్పటానికి సూచనలు..

అంతేకాదు, ఈ టీను తీసుకోవ‌డం వ‌ల్ల హార్మోన్లు సమతుల్యం అవుతాయి.ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

Advertisement

మ‌న‌సు, మెద‌డు ప్ర‌శాంతంగా మార‌తాయి.మ‌రియు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ సూప‌ర్ స్ట్రోంగ్‌గా కూడా మారుతుంది.