రోజుకు ఒక‌సారి ఈ జ్యూస్ తాగితే నెల రోజుల్లో నాజూగ్గా మార‌తారు!

ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది అధిక బరువు సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారు.

అద్దం ముందు నిలబడి నప్పుడల్లా తమ శరీర ఆకృతిని తామే నిందించుకుంటూ ఒత్తిడికి గురవుతుంటారు.

ఈ క్రమంలోనే బరువు తగ్గడం కోసం నానా తంటాలు పడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇకపై అధిక బరువుతో చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను రోజుకు ఒకసారి తీసుకుంటే కనుక నెల రోజుల్లోనే నాజూగ్గా మారతారు.

అధిక బరువు సమస్య నుంచి సులభంగా బయట పడతారు.మరి ఇంకెందుకు ఆలస్యం.వెయిట్ లాస్‌కు ఉపయోగపడే ఆ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి.? ఎప్పుడు తీసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేయండి.ముందుగా ఒక క్యారెట్, ఒక గ్రీన్ ఆపిల్, ఒక రెడ్ క్యాప్సికం, ఒక టమాటో లను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు బ్లండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, గ్రీన్ ఆపిల్ ముక్కలు, టమాటో ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి.అలాగే వ‌న్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల రోస్ట్డ్ ఓట్స్, చిటికెడు దాల్చిన చెక్క పొడి, ఒక గ్లాసు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

If You Drink This Juice Once A Day, You Will Become Slim In A Month , Weight Los
Advertisement
If You Drink This Juice Once A Day, You Will Become Slim In A Month , Weight Los

ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ లో వ‌న్ టేబుల్ స్పూన్ వేయించిన నువ్వులు మిక్స్ చేసి సేవించాలి.రోజు బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు ఈ జ్యూస్ ను తీసుకుంటే శరీరంలో క్యాలరీలు త్వరగా కరుగుతాయి.వెయిట్ లాస్ అవుతారు.

దాంతో లావుగా ఉన్నవారు కేవలం కొద్ది రోజుల్లోనే నాజూగ్గా మారతారు.పైగా ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు విష ప‌దార్థాలు తొలగిపోతాయి.

బాడీ డీటాక్స్ అవుతుంది.తద్వారా వివిధ రకాల జబ్బులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు