సీఎంగా నచ్చకపోతే రెండు సంవత్సరాలలో నేనే పదవి నుండి తప్పుకుంటా పవన్ సంచలన వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న వారాహి యాత్ర సంచలనం సృష్టిస్తోంది.

మొదటిరోజు కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై అదే విధంగా సీఎం వైఎస్ జగన్ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

ఇదిలా ఉంటే నేడు వారాహి యాత్రలో భాగంగా కాకినాడ జిల్లా చేబ్రోలులో పట్టు రైతులు, చేనేత కళాకారులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రిగా తనకి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.రెండు సంవత్సరాలలో తన పనితీరు నచ్చకపోతే రీకాల్ చేయండి ముఖ్యమంత్రి పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటా.అని వ్యాఖ్యానించారు.2024, 2029లో జనసేన పార్టీని నమ్మండని విజ్ఞప్తి చేయడం జరిగింది.రాష్ట్రాన్ని బంగారు ఆంధ్రప్రదేశ్ గా మార్చి చూపిస్తానని పవన్ తెలియజేశారు.

మంచి పాలన అందిస్తానని.ఒకవేళ పాలన నచ్చకపోతే రెండు సంవత్సరాలలో నేనే పదవి నుండి స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటానని చేబ్రోలులో రైతులు చేనేత కళాకారుల ఆత్మీయ సమ్మేళనంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

Advertisement

ఇంకా ఈ కార్యక్రమంలో ప్రజల నుండి అనేక ఫిర్యాదులు తీసుకోవడం జరిగింది.అనేక వర్గాల ప్రజలు తమ సమస్యలను పవన్ కి తెలియజేశారు.

ఉభయగోదావరి జిల్లాలలో జనసేన వారాహి యాత్ర ఏపీ రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టిస్తోంది.ఇదే సమయంలో పవన్ ఇస్తున్న హామీలు కూడా రాజకీయంగా సంచలనంగా మారుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు