దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు( Cyber fraud ) పెరుగుతూ పోతున్నాయి.అమాయకులను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు సరికొత్త స్కాంలను అమలు పరుస్తూ దొరికినంత వరకు దోచుకుంటున్నారు.
ఈ కోవలోనే ఢిల్లీకి ( Delhi )చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్ మోసానికి గురై ఏకంగా లక్ష రూపాయలను నష్టపోయాడు.సాధారణంగా సోషల్ మీడియాలో అనేక రకాల యాడ్స్ వస్తుంటాయి.
కొన్ని ఫేక్ యాడ్స్ కూడా సైబర్ నేరగాల నుండి వస్తుంటాయి.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో బిగ్ బజార్ స్టోర్ ( Big Bazaar Store )పేరుతో 75% డిస్కౌంట్ ఆఫర్ చేసిన యాడ్ పై ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల వ్యక్తి క్లిక్ చేశాడు.
అందులో నాలుగు వస్తువులను కొనుగోలు చేయగా అవి డెలివరీ కాలేదు.ఆ వ్యక్తి ఈ వస్తువులను కొనుగోలు చేసేందుకు తన ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ కార్డును( ICICI Bank Debit Card ) ఉపయోగించాడు.
ఆ డెబిట్ కార్డ్ క్షణాల్లో హ్యాక్ చేయబడి లక్ష రూపాయలు స్వాహా అయ్యాయి.

దీంతో బాధిత వ్యక్తి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.తన ఫిర్యాదులో యాడ్ పై తాను క్లిక్ చేసి కొనుగోలు చేసిన ఐటమ్స్ ఏ డెలివరీ ఏజెన్సీ వాటిని తనకు డెలివరీ చేయలేదని బాధితుడు వాపోయాడు.తన బ్యాంక్ ఖాతా నుండి డబ్బు డిడక్ట్ అయినట్లు తనకు మూడు టెక్స్ట్ మెసేజ్లు వచ్చాయని చెప్పాడు.తన డెబిట్ కార్డును హ్యాక్ చేసిన స్కామర్లు ఫ్లిప్కార్ట్ నుంచి రూ.40000, రూ.39900, రూ.40000 చొప్పున లావాదేవీలు జరిపినట్లు పేర్కొన్నాడు.డబ్బు డిడక్ట్ అయినట్లు మెసేజ్లు రావడంతో వెంటనే డెబిట్ కార్డును బ్లాక్ చేసి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.







