శివుడికి ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఫలితం దక్కుతుంది..?

సాధారణంగా శివుడిని అభిషేకం( Shiva Abhishekam ) చేయడం వలన త్వరగా ప్రసన్నం చేసుకోవచ్చని, ఆయనకు అభిషేకం అంటే చాలా ఇష్టమని, ఇటీవలే ఓ మహా పండితులు తెలిపారు.

శివాభిషేకము అనేది భక్తిశ్రద్ధలతో ఆచరించాలి.

ఈ సృష్టిలో ప్రతి అణువులోను శివుడు ఉన్నాడని అంటారు.అయితే శివుడు ఇచ్చిన దానినే ఆయనకు తిరిగి భక్తితో సమర్పిస్తున్నామనే భావన మాత్రమే అభిషేకం చేసేవారి మనసుల్లో ఉండాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి( Chilakamarthi Prabhakar ) శర్మ తెలిపారు.

అయితే శాస్త్రం ప్రకారం శివుడిని అనేక పదార్థాలతో అభిషేకించవచ్చు.

If You Anoint Lord Shiva With Any Of The Ingredients, You Will Get Results , Lor

ఈ పదార్థములతో అభిషేకించేటప్పుడు భక్తిశ్రద్ధలు ముఖ్యమైనవిగా ఉండాలి.ఇక ఆడంబరాలతో చేసే పూజలు, అభిషేకాల కన్నా భక్తితో ఆచరించే అభిషేకమే ఉత్తమమైనది.అయితే ఎలాంటి వాటితో శివాభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు దక్కుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
If You Anoint Lord Shiva With Any Of The Ingredients, You Will Get Results , Lor

శివాభిషేకం గరిక నీటితో చేయడం వలన నష్టాలు కలగవు.అలాగే గరిక నీటితో శివాభిషేకము చేస్తే నష్టమైన ద్రవ్యము తిరిగి పొందుతారు.

ఇక నువ్వుల నూనెతో అభిషేకిస్తే అపమృత్యువు నశింస్తుంది.ఆవుపాల అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములను ప్రసాదిస్తారు.

ఇక శివుడిని పెరుగుతో అభిషేకిస్తే( Curd ) బలము, ఆరోగ్యం, యశస్సు లభిస్తుంది.

If You Anoint Lord Shiva With Any Of The Ingredients, You Will Get Results , Lor

అంతేకాకుండా ఆవు నెయ్యి( Cow ghee )తో శివుడిని అభిషేకిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.అంతేకాకుండా చెరుకు రసముతో శివుడిని అభిషేకించడం వలన ధన వృద్ధి కలుగుతుంది.ఇక మెత్తని చక్కెరతో అభిషేకించిన కూడా దుఃఖం నాశనం అవుతుంది.

దర్శకుడిని ఓ రేంజిలో ఉతికారేసిన చంద్రమోహన్.. అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు..

ఇక మారేడు బిల్వదళ జలముతో శివుడిని అభిషేకం చేస్తే భోగభాగ్యములు లభిస్తాయి.అలాగే తేనెతో అభిషేకించిన తేజ వృద్ధి కలుగుతుంది.

Advertisement

అంతేకాకుండా కొబ్బరి నీటితో అభిషేకిస్తే కూడా సకల సంపదలు కలుగుతాయి.ఇక రుద్రాక్ష జలాభితో అభిషేకిస్తే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి.

బంగారపు నీటితో అభిషేకం చేస్తే ఘోర దారిద్రము నశించిపోతుంది.

తాజా వార్తలు