హ‌లో లేడీస్‌.. ఈ త‌ప్పులు చేస్తే మీ గుండె రిస్క్‌లో ప‌డ‌టం ఖాయం..జాగ్ర‌త్త‌!

పురుషుల‌తో పోలిస్తే స్త్రీల‌లో గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ కాస్త త‌క్కువ‌గా ఉండేది.

కానీ, ప్ర‌స్తుత రోజుల్లో స్త్రీ, పురుషులిద్ద‌రిలోనూ గుండె జబ్బులు సమాన స్థాయిలో ఉన్నాయి.

పైగా స్త్రీలు గుండె స‌మ‌స్య‌ల‌కు గురైతే.ప్రాణాలు పోయే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంది.

అందుకే స్త్రీలు గుండె ఆరోగ్యం విష‌యంలో ఎంతో శ్ర‌ద్ధ వ‌హించాలి.ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే త‌ప్పుల‌ను లేడీస్ పొర‌పాటున కూడా చేయ‌కూడ‌దు.

చేశారో గుండె రిస్క్‌లో ప‌డ‌టం ఖాయం.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.

Advertisement
If Women Make These Mistakes, Heart Health Is Damaged! Women, Women Health, Heal

వివాహ‌మైన త‌ర్వాత చాలా మంది స్త్రీలు గర్భనిరోధక మాత్రలను తెగ వాడేస్తుంటారు.అయితే ఈ త‌ప్పే మీ గుండెకు ముప్పు తెచ్చిపెడుతుంది.

అవును, గర్భ నిరోధక మాత్రలను అధికంగా వినియోగ‌డం వ‌ల్ల గుండెపై తీవ్ర ఒత్తిడి ప‌డుతుంది.ఫ‌లితంగా గుండె సంబంధిత స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.

అలాగే ఈ మ‌ధ్య కాలంలో పురుషుల‌తో పాటు స్త్రీలు సైతం మ‌ద్య‌పానం, ధూమ‌పానం వంటి వాటికి బాగా అల‌వాటు ప‌డుతున్నారు.అయితే ఈ చెడు అల‌వాట్లు వ‌ల్ల‌ హార్ట్ స్ట్రోక్ వ‌చ్చే ప్ర‌మాదం భారీగా పెరుగుతుంది.

కాబ‌ట్టి, ఇక‌పై మ‌ద్య‌పానం, ధూమ‌పానం అల‌వాట్ల‌ను మానుకుంటే చాలా మంచిది.

If Women Make These Mistakes, Heart Health Is Damaged Women, Women Health, Heal
నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

చాలా మంది మ‌హిళ‌లు వ్యాయామాలు చేయ‌డానికి పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూప‌రు.దీని వ‌ల్ల ఫిట్ నెస్ దెబ్బ తిని బ‌రువు పెర‌గ‌డ‌మే కాదు.గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ సైతం పెరుగుతుంది.

Advertisement

కొంద‌రు శ‌రీర బ‌రువు ఎంత పెరుగుతున్నా ప‌ట్టించుకోరు.ఇదీ కూడా గుండెను డేంజ‌ర్ జోన్‌లో ప‌డేస్తుంది.

కాబ‌ట్టి, బ‌రువును ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉంచుకోవాలి.ఇక ఒత్తిడికి వీల‌నైంత వ‌ర‌కు దూరంగా ఉండాలి.

డైట్‌లో పోష‌కాహారం ఉండేలా చూసుకోవాలి.మ‌రియు ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉంటే ఎప్ప‌టిక‌ప్పుడు చక‌ప్‌ చేయించుకుని మందులు వాడాలి.

తాజా వార్తలు