వైరల్: ఇలాంటి విన్యాసాలు చేస్తే చావుని ఆహ్వానించడమే అవుతుంది!

సోషల్ మీడియా మానియా నేడు అనేకమంది యువతీ యువకులను బానిసలుగా చేసుకుంటోంది.ఈ క్రమంలోనే కోరి ప్రమాదాలను కొనితెచ్చుకుంటుంటారు.

ఈ క్రమంలో కొందరు ప్రమాదమని తెలిసినా డేంజరస్ స్టంట్స్ ( Dangerous Stunts )చేస్తూ, వారు ఇబ్బంది పడడమే కాకుండా ఇతురులు కూడా ప్రమాదాల్లో చిక్కుకు పోవడానికి కారకులు అవుతూ ఉన్నారు.ఇక ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఏ స్థాయిలో వైరల్ అవుతాయో అందరికీ తెలిసిందే.

తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

If Viral Does Such Stunts It Will Be Inviting Death, Bike , Driver, Stuns, Viral

ఇక్కడి వీడియోని గమనిస్తే.ఇద్దరు కుర్రాళ్లు బైకుపై( Boys on bikes ) వెళ్తుంటారు.మధ్య మధ్యలో బైకు నడుపుతున్న వ్యక్తి.

Advertisement
If Viral Does Such Stunts It Will Be Inviting Death, Bike , Driver, Stuns, Viral

నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు.బైకును అటూ, ఇటూ తిప్పుతూ ప్రమాదకర విన్యాసాలు చేస్తూ శునకానందం పొందుతూ ఉంటాడు.

ఈ క్రమంలో రోడ్డు మలుపు తిరుగుతుండగా.సడన్‌గా ఎదురుగా ఓ ట్రక్కు వస్తుంది.

అయితే తీరా దాని దగ్గరికి వెళ్లే సమయంలో అతను బైకును కంట్రోల్ చేసి, రోడ్డుకు అవతలి వైపు వెళ్లిపోతాడు.దీంతో వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పినట్టు అవుతుంది.

ఈ ఘటనను వారి వెనుకే మరో బైకులో వస్తున్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం సదరు వీడియో వైరల్ అవుతోంది.

If Viral Does Such Stunts It Will Be Inviting Death, Bike , Driver, Stuns, Viral
మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

కాగా ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.‘‘ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయడం మానుకోండి చవటల్లారా!’’.అని కొంతమంది కామెంట్ చేస్తే, ‘‘మీ టైం చాలా బాగుంది.

Advertisement

వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పింది’’.అంటూ కొందరు, వీరికి ఇంకా భూమిమీద నూకలు ఉన్నాయి అంటూ రకరకాల కామెంట్స్ చేస్తూ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఈ వీడియో ప్రస్తుతం 700కి పైగా లైక్‌లు, 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకొని సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో ఇక్కడ కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

తాజా వార్తలు