ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పేరు మార్మోగిపోతోంది.ఇలా శేఖర్ మాస్టర్ పేరు పెద్ద ఎత్తున వినిపించడానికి గల కారణం ఆయన చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన పాటకు కొరియోగ్రఫీ నిర్వహించడమే.
ప్రస్తుతం ఆచార్య సినిమా నుంచి విడుదలైన భలే భలే బంజారా అనే పాట సోషల్ మీడియా లో దూసుకుపోతుంది.ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం విశేషం.
సాధారణంగా చిరంజీవికి కొరియోగ్రఫీ చేయాలంటే కత్తిమీద సాము వంటిది.అలాంటిది చిరంజీవితో పాటు రామ్ చరణ్ కి కలిపి కొరియోగ్రఫీ చేయాలంటే డాన్స్ మాస్టర్ లకు పెద్ద టాస్క్అని చెప్పాలి.
ఇకపోతే శేఖర్ మాస్టర్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని ఈ పాట గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ చిరంజీవి రామ్ చరణ్ కలిసి డాన్స్ చేస్తుంటే ఒక పండుగ లాగా ఉంది.
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ పాటకు డాన్స్ కంపోజ్ చేసే వరకు నాకు నిద్ర కూడా పట్టలేదని శేఖర్ మాస్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు.ఈ పాట రిహార్సిల్స్ చేసి షూట్ చేస్తున్న సమయంలో ఎంతో మంది దర్శక నిర్మాతలు షూటింగ్ లొకేషన్ కి వచ్చి వీరి డాన్స్ చూసేవారు.

ఇలా షూటింగ్ లొకేషన్ కి ఎంతోమంది దర్శకనిర్మాతలు తరలిరావడం అనేది కేవలం ఈ పాట విషయంలోనే జరిగి ఉంటుందేమో అంటూ శేఖర్ మాస్టర్ వెల్లడించారు.ఇలా షూటింగ్ సమయంలోనే ఎంతో సందడి చేస్తున్న ఈ పాట థియేటర్లో అభిమానులకు పూనకాలు తెప్పించడం గ్యారెంటీ.ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న ఈ పాట థియేటర్లో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో తెలియాల్సి ఉంది.







