ప్రతిపక్షాల ట్రిక్కులకు మోసపోవద్దని ఏమరూపాటుగా ఉంటే ఆగమైపోతామంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ).ఎన్నికల ప్రచారం లో బాగం గా నిర్మల్, బాల్కొండ, ధర్మపురి( Nirmal, Balkonda, Dharmapuri ) లలో నిర్వహించిన టిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించిన కేసీఆర్ అబివృద్దే మా తారక మంత్రమని, గత ప్రభుత్వాల హాయములో జరిగిన అభివృద్ధిని ఇప్పటి బారతీయ రాష్ట్ర సమితి హాయంలో జరిగిన అభివృద్ధిని పోల్చి సరైన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.
తమ మానిఫెస్టో లో అంశాలను ప్రజలకు వివరించిన కెసిఆర్ ప్రతిపక్షాల పై కూడా విమర్శలు చేశారు .ప్రదాని మోడీకి ( Prime Minister Modi )ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకుందని, అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న మోడీ కరెంటు సంస్థలను కూడా ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని, మోటార్లకు మీటర్లు బిగించాలని ఎంత ఒత్తిడి చేసిన రైతులకు ఇబ్బంది కలగకూడదని గట్టిగా నిలబడ్డామని చెప్పుకొచ్చారు .ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతే రైతుల సమస్యలు తీరాయని ఇప్పుడు కాంగ్రెస్(
Congress ) వస్తే పోర్టల్ ను కొనసాగనివ్వదని ఆయన ప్రజలని హెచ్చరించారు.

దేశంలో ఎక్కడా రైతుబంధు, రైతు బీమా( Rythu Bandhu, Rythu Bima ) వంటి పథకాలు అమలు కావడం లేదని ,దశలవారీగా రైతు బందును 16 వేల వరకు పెంచుతామని హామీ ఇచ్చారు .ఇప్పుడు ఒక్క అవకాశం ఉంటున్న కాంగ్రెస్ 11 సార్లు అవకాశం వస్తే ఏం చేసిందంటూ ఆయన నిలదీశారు .కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటకలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతున్నారని కానీ తెలంగాణలో 24 గంటలు కరెంటు ఇస్తున్నాము అని తెలుసుకోవాలంటూ ఆయన చెప్పుకొచ్చారు.తన వ్యాఖ్యలపై పల్లె స్థాయిలో ప్రజలు చర్చలు పెట్టాలని, ప్రభుత్వాల పనితీరును మదింపు చేసుకొని సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.పోరాటాల ఫలితంతో ఏర్పడిన పార్టీ భారత రాష్ట్ర సమితి అని దశాబ్దాల పాటు తెలంగాణ కోసం కొట్లాడి సాధించుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
తన ప్రతి సభ ద్వారా తెలంగాణ ప్రజలకు తాము చేసిన అభివృద్ది ని వివారిస్తున్న కేసీఆర్ తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయి అన్న ధీమాలో ఉన్నారు.