Tulsi Plant : తులసి మొక్క ఆ దిశలో ఉంటే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు వస్తాయా..

ప్రపంచవ్యాప్తంగా ఉన్నా మన దేశ ప్రజలు దాదాపు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లలో తులసి మొక్కను పెంచుకుంటూ ఉంటారు.

ఎందుకంటే తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు.

అంతేకాకుండా తులసి మొక్కలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి.తులసి మొక్క ఉన్న ఇల్లు సుఖశాంతులతో ,సిరిసంపదలతో ,ఎంతో సంతోషంగా ఉంటుందని చాలా మంది ప్రజల నమ్మకం.

తులసి దళాలతో శివకేశవులను పూజించిన వారికి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్మకం.నర్మదా నదిని చూడడం, గంగా స్థానం చేయడం, తులసి వనాన్ని సేవించడం వల్ల సమాన పుణ్యఫలం లభిస్తుందని వేద పండితులు చెబుతారు.

ఆషాడ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక సుద్ధ పౌర్ణమి వరకు చాత్రుమాస్య దీక్ష ఈ సమయంలో తులసి మొక్కను చోటు మార్చి నాటడం ఆ ఇంటికి అంత మంచిది కాదు.ఇంట్లో తులసి మొక్క ఉంటే దానిపై నుంచి వచ్చే గాలి ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది.

Advertisement
If The Tulsi Plant Is In That Direction, Will Ashtaiswaryas Come To That House ,

ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆపుతుంది.తులసి మొక్కను పెంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు రాకుండా తులసి రక్షిస్తుంది.

If The Tulsi Plant Is In That Direction, Will Ashtaiswaryas Come To That House ,

కుటుంబ ఆర్థిక స్థితి మెరుగు పడడానికి తులసి మొక్క తప్పకుండా పెంచుకోవాలి.ఎందుకంటే తులసి దిష్టి నుంచి కూడా ఇంటిని కాపాడుతుంది.తులసి మొక్క ఉన్న ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి సుఖ సంతోషాలతో ఉంటారు.

వాస్తు ప్రకారం తులసి మొక్కను తూర్పు దిక్కున పెంచుకోవడం అన్నింటికంటే శ్రేష్టం అని చెబుతారు.అక్కడ పెట్టే అవకాశం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్యంలో బాల్కనీ, కిటికిలో పెట్టుకోవచ్చు.

దానిమ్మ ర‌సంలో ఇవి క‌లిపి సేవిస్తే..ఆ జ‌బ్బులు మాయం!

మొక్కకి సరిపడేంత వెలుతురు కూడా ఉండే విధంగా జాగ్రత్త చూసుకోవడం మంచిది.ప్రతి రోజూ సంధ్యా సమయంలో తులసి దగ్గర దీపం వెలిగించడం ఉత్తమమైన పని.కార్తీక మాసంలో తులసి మొక్క నాటుకోవడం మంచిది..

Advertisement

తాజా వార్తలు