అద్దెకున్నవాడు స్టార్టప్‌ పెడితే ఇంటి ఓనర్ 10 వేల డాలర్ల పెట్టుబడి పెట్టాడు... ఎక్కడంటే?

ప్రస్తుతం పట్టణాల్లో అద్దె ఇళ్లకు ఎలాంటి గీరాకి వుందో చెప్పాల్సిన పనిలేదు.అనువైన ప్రాంతంలో, తమకు కావలసిన వసతులు వుంటే, ఎంత అద్దె చెల్లించేందుకైనా జనం వెనుకాడటం లేదు.

 If The Tenant Puts Up A Startup, The Home Owner Invests 10 Thousand Dollars Wher-TeluguStop.com

అందుకే చాలా మంది ఇలాంటి అవకాశాలను క్యాష్ చేసుకుంటున్నారు.ఇళ్లను నిర్మించి వాటిని అద్దెకు ఇచ్చి రెండు చేతుల సంపాదిస్తున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళితే, భారత ఐటీ రాజధానిగా ఖ్యాతి తెచ్చుకున్న బెంగళూరు( Bangalore ) నగరంలో ఇప్పుడు విచిత్ర పరిస్ధితి నెలకొంది.ప్రస్తుతం టెక్ కంపెనీలు( Tech companies ) లే ఆఫ్‌లను ప్రకటించడంతో నగరంలోని ఇంటి యజమానుల గుండెల్లో గుబులు బయలుదేరింది.

Telugu Latest, Puts, Startup, Tenant-Latest News - Telugu

ఈ క్రమంలో టెక్ కంపెనీలలో పని చేస్తున్న ఉద్యోగులు ఇళ్ల యజమానులు పెట్టే కఠినమైన షరతులను ఎదుర్కోలేక నానా కష్టాలు పడాల్సి వస్తోంది.దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వైరల్ పోస్ట్‌లు అద్దెదారుల ఇబ్బందులను తెలయజేస్తున్నాయి.అవును, ఇళ్లు అద్దెకు ఇవ్వాలంటే IIT, IIM డిగ్రీలు వుండాలని యజమానులు డిమాండ్ చేయడం కొసమెరుపు.ఈ నేపథ్యంలో పవన్ గుప్తా( Pawan Gupta ) అనే అద్దెదారు ‘బెటర్‌హాఫ్’( Betterhof ) స్టార్టప్ కోసం ఇంటి యజమాని నుంచి 10 వేల డాలర్లు సేకరించిన తర్వాత కొన్ని స్టార్టప్ కంపెనీలకు కొత్త ఐడియా వచ్చింది.

Telugu Latest, Puts, Startup, Tenant-Latest News - Telugu

ఇక్కడ గుప్తా ఏమని పోస్ట్ చేశారంటే, సింగిల్స్ కోసం ఏఐ ద్వారా నడిచే ఫస్ట్ మ్యారేజ్ సూపర్ యాప్‌లో ఇంటి యజమాని 10 వేల డాలర్లు పెట్టుబడి పెట్టారని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న వాట్సాప్ చాట్‌లో ఇంటి యజమాని, తాను మీ స్టార్టప్‌లో పెట్టుబడి పెడుతున్నానని చెప్పడం మనం చూడవచ్చు.దీనికి పవన్ ఆల్ ది బెస్ట్ .మీరు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారని ఆశిస్తున్నానని రిప్లయ్ ఇచ్చాడు.ఆ సందేశంలోనే తాను బెటర్‌హాఫ్ స్టార్టప్‌లో 10 వేల డాలర్ల పెట్టుబడి పెట్టినట్లు పేర్కొన్నాడు.కఠినమైన వ్యాపార పరిస్ధితుల్లో నేను ఊహించని పెట్టుబడిదారుని నా యజమానిలో కనుగొన్నానని పవన్ ట్వీట్‌ చేయడం ఇక్కడ చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube